AP Minister Kodali Nani: శవాల మీద చిల్లర ఏరుకునే రాజకీయాలు, జగన్‌పై అక్రమంగా కేసులు పెట్టిన వారు ఏమయ్యారో చూశారుగా, చంద్రబాబు, పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని
తనను క్షమాపణ చెప్పమనడమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో గానీ, బయట గానీ తాము భువనేశ్వరి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.
Amaravati, Nov 25: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై, పార్టీ నేతలపై మంత్రి కొడాలి నాని (AP Minister Kodali Nani) ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన గురువారం స్పందించారు. తన రాజకీయం కోసం చంద్రబాబే (Chandrababu naidu)భార్యను అల్లరి చేసుకుంటూ.. తనను క్షమాపణ చెప్పమనడమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీలో గానీ, బయట గానీ తాము భువనేశ్వరి గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తనకు సెక్యూరిటీ అవసరం లేదన్న చంద్రబాబు (Chandra babu) వెంటనే జెడ్‌ప్లస్ సెక్యూరిటీని వదిలేయాలని డిమాండ్ చేశారు.
శవాల మీద చిల్లర ఏరుకునే నాయకుడు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఆయన భార్య పేరును వాడుకుంటే నందమూరి కుటుంబం (Nandamuri Family) మద్దతిస్తుందనే చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి.. తన భార్యను అవమానించారని, అందుకే అసెంబ్లీకి వెళ్లడం లేదని చెప్పడం’ రాజకీయం కోసం బాబు చేస్తున్న డ్రామా అన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు అంతా అమాయకులు. ఎన్టీఆర్ సీఎంగా ఉంటే పార్టీ నాశనం అవుతుందని చంద్రబాబు చెప్పినా విన్నారు.
గొర్రె కసాయి వాడినే నమ్ముతుంది. చంద్రబాబు ఏది చెప్పినా నమ్ముతుంది’ అంటూ నందమూరి కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నందమూరి కుటుంబం అంటే సీఎం జగన్ కూడా గౌరవం ఉందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ (junior NTR) తమను కంట్రోల్ చేయడమేంటని ప్రశ్నించారు. ఆయనతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ‘ఒకప్పుడు కలిసి ఉండొచ్చు. ఇప్పుడు విడిపోయాం. ఆయన చెబితే మేమెందుకు వింటాం? ఇప్పుడు నేను, వంశీ జగన్‌తో ఉన్నాం. ఆయన కోసం పని చేస్తున్నాం’ అన్నారు.
జగన్‌పై అక్రమంగా కేసులు పెట్టించిన సోనియా ఏమయ్యారో.. కేసులు పెట్టిన శంకర్రావు పరిస్థితి ఏంటో.. ఎర్రంనాయుడు ఏమయ్యాడో అంటూ చూశారు’ అంటూ.. వరద బాధితులతో ‘సీఎం గాల్లో వచ్చాడు.. గాల్లో కలిసిపోతాడు’ అంటూ చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని ఈ విధంగా స్పందించారు.
ఇదిలా ఉంటే నందమూరి హీరో జూనియర్ ఎన్టీయార్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ విజయవాడలో వర్ల రామయ్య దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య తెలిపారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య నిలదీశారు.
వల్లభనేని వంశీ ఫొటోలు పెట్టినప్పుడే ఎన్టీయార్ ఘాటుగా స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదని వర్ల అన్నారు. బూతుల మంత్రి పేర్నినానికి ఎన్టీయార్ అంటే చాలా భయమని, అలాంటి వారిని కంట్రోల్ చేసే శక్తి ఆయనకే ఉందని చెప్పారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవాళ్లే టీడీపీ సభ్యులని వర్ల స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీయార్‌పై తాను చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని వర్ల రామయ్య ప్రకటించారు.
జూనియర్ ఎన్టీయార్ స్పందన ప్రవచనాలు చెప్పినట్లు ఉందని, ఆ వీడియో చూసి పిల్లలు కూడా నవ్వారని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీయార్ అంటే పేర్ని నానికి, వల్లభనేని వంశీకి చాలా భయమని చెప్పారు. ఎన్టీయార్ వార్నింగ్ ఇస్తే వాళ్లిద్దరూ తోకలు ముడుచుకుని పోతారని వర్ల అభిప్రాయపడ్డారు. ఎన్టీయార్ స్పందించిన తీరు చూసి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధపడ్డారని తెలిపారు.
ఇక చంద్రబాబు.. ముఖ్య మంత్రి గాల్లోనే వస్తాడు.. గాల్లోనే పోతాడు.. గిరగిరా తిరుగుతున్నాడు. ఎక్కడో ఓ చోట శాశ్వతంగా ఫినిష్ అవుతాడు. మనతో పెట్టుకు న్నోడు కాలగర్భంలో కలిసిపోయాడు. కడుపు కాలుతోంది.. మండుతోంది’ అని చిత్తూరు జిల్లా పర్యటనలో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాపానాయుడుపేట, తిరు చానూరు, రాయలచెరువు, తిరుపతిలో బుధవారం చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు.
టీడీపీ శ్రేణులు, స్థానికులను ఉద్దేశించి ప్రసంగించారు. హుదుద్ తుఫాను సందర్భంగా తాను విశాఖలోనే ఉండి వారంలో అన్నీ చక్కదిద్దానని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ ఏరియల్ సర్వే మాత్రమే నిర్వహించారని విమర్శించారు. చంద్రగిరి– శ్రీకాళహస్తి మధ్య స్వర్ణముఖి నదిపై బ్రిడ్జి లు, చెక్ డ్యామ్‌లు కట్టించానన్నారు. వాటిని కాపా డలేక వదిలేయడం వల్లే కొట్టుకుపోయాయని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీని వాయిదా వేసి వరద ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు.