నిన్న జరిగిన ఏపీ అసెంబ్లీ పరిణామాలపై జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పందించారు. ఈ మేరకు శనివారం ప్రత్యేకంగా విడుదల చేసిన వీడియోలో మాట్లాడారు. నిన్నటి అసెంబ్లీ ఘటన కలిచివేసిందని, మహిళలను పరుష పదజాలంతో దూషించడం మన సంస్కృతి కాదని పేర్కొన్నారు. విమర్శలు ప్రజా సమస్యలపై జరగాలి..రాజకీయంలో విమర్శలు.. ప్రతి విమర్శలు సహజం.. వ్యక్తిగత విమర్శలు సరికాదు. ఆడవాళ్లను గౌరవించడం మన సంప్రదాయం.. ఈ మాట వ్యక్తిగత దూషణకు గురైన కుటుంబ సభ్యుడిగా మాట్లాడడం లేదు.

నేనో కొడుకుగా, తండ్రిగా, దేశ పౌరుడిగా, తెలుగువాడిగా మాట్లాడుతున్నా.. ప్రజా సమస్యలను పక్కకు పెట్టి వ్యక్తిగతంగా ఆడవాళ్ల గురించి మాట్లాడుతున్నామో అది మన అరాచక పాలనకు నాంది పలుకుతుంది. మన సంపద్రాయన్ని , సంస్కృతిని రాబోయే తరాలకు గౌరవంగా అప్పగించాలని.. అలా కాకుండా సంస్కృతిని కాల్చేసి భావి తరాలకు చెడు సంస్కృతి నేర్పవద్దని కోరుతున్నా.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)