AP Municipal Poll Results 2021: దూసుకుపోతున్న వైసీపీ, ప్రతిచోటా ఆధిక్యంలో జగన్ సర్కారు, డోన్‌ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం, కనిగిరి మున్సిపాలిటీలో వైసీపీ క్లీన్ స్వీప్, కొవ్వూరు మునిసిపాలిటీ వైసీపీ ఖాతాలోకి..

కౌంటింగ్ ఆరంభం నుంచి వైసీపీ ఆధిక్యత కనపరుస్తూ వస్తోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా ముందుగా లెక్కించిన పోస్టల్‌ బ్యాలెట్‌ల్లో వైఎస్ఆర్‌సీపీదే ఆధిక్యం సాధించింది. ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది.

TDP VS YSRCP VS BJP LOGOS (Photo-File Image)

Amaravati, Mar14: ఏపీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. కౌంటింగ్ ఆరంభం నుంచి వైసీపీ ఆధిక్యత కనపరుస్తూ వస్తోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా ముందుగా లెక్కించిన పోస్టల్‌ బ్యాలెట్‌ల్లో వైఎస్ఆర్‌సీపీదే ఆధిక్యం సాధించింది. ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. ఇప్పటికే కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకుంది.  అలాగే చీమకుర్తి నగర పంచాయితీని కూడా వైసీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ 20 వార్డుల్లో 18 జగన్ పార్టీ, 2 స్థానాలు టీడీపీ గెలుచుకున్నాయి.

ఇప్పటికే 18 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ.. చాలా స్థానాల్లో ముందంజలో ఉంది. కనిగిరిలో 20 వార్డులకు గాను 20 గెలుచుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది. కర్నూలు జిల్లా డోన్‌ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 32 వార్డులకు గాను ఇప్పటికే 30 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

తుని మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంది. 30 వార్డులకు గాను ఇప్పటివరకు 18 చోట్ల వైఎస్‌ఆర్‌ సీపీ గెలుపొందింది. మరోసారి యనమలకు ఎదురుదెబ్బ తగిలింది. మండపేటలో 1, 2, 8 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించింది.

పశ్చిమ గోదావరి జిల్లాలోని కోవ్వూరు మునిసిపాలిటీని వైఎస్‌ఆర్‌సిపి గెలుచుకుంది. పార్టీ 23 వార్డులలో 15 లో విజయం సాధించింది. 7 స్థానాల్లో టీడీపీ, ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించింది. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలలో పోలింగ్ చేసిన ఓట్ల లెక్కింపు కోసం విశాఖపట్నం జిల్లా అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. లెక్కింపు ప్రక్రియ కోసం, నగరంలోని మొత్తం ఎనిమిది మండలాలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ఎనిమిది వేర్వేరు భవనాలు ఎంపిక చేయబడ్డాయి. ఈ ఫలితాల మీదనే అందరి కన్ను ఉంది.

ఆ మూడు స్థానాల పైనే అందరి కన్ను, ఏపీలో మొదలైన పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు, మరి కొద్ది గంటల్లో ఫలితాలు, ఏలూరు మినహా అన్ని స్థానాలకు కౌంటింగ్

విశాఖపట్నంలోని బ్యాలెట్ బాక్సులలో "విశాఖ ఉక్కు - ఆంధ్రూల హక్కు" (వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర హక్కు 'అనే పదాలు ఉన్న లేఖలు దొరికాయి. నెల్లూరు జిల్లా నాయుడు పేట పురపాలక సంఘంలో రెండు వార్డుల్లో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. మొత్తం 25వార్డులు ఉండగా ఇప్పటికే 23 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందులో వైసీపీ 21, టీడీపీ 1, బీజేపీ 1 స్థానాల్లో ఏకగ్రీవం అయ్యాయి. ఈ రోజు జరిగిన రెండు వార్డుల ఓట్ల లెక్కింపులు జగన్ సర్కారు విజయం సాధించింది.

ఎన్నికల ఫలితాలు ఇలా..

అనంతపురం: మడకశిరలో 2, 3, 7, 10 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించింది

వైఎస్‌ఆర్‌జిల్లా: ఎర్రగుంట్లలో 11, 14 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం

కృష్ణా: ఉయ్యూరు 8వ వార్డులో వైఎస్‌ఆర్‌సీపీ విజయం

నెల్లిమర్లలో ఇప్పటివరకు 6 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం

2, 3. 4, 5, 7, 8 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు

కర్నూలు: ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం

24 డివిజన్లకుగాను 21 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ విజయం

అమలాపురం మున్సిపాలిటీలో ఇప్పటివరకు 10 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం. 1, 8, 10, 11, 12, 13, 14, 16, 17, 25 వార్డుల్లో ఫ్యాన్‌ హవా

నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ

నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరిలో వైఎస్ఆర్‌సీపీ గెలుపు

చిత్తూరు: మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 35 వార్డులకు గాను ఇప్పటివరకు 19 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు

గుంటూరు కార్పొరేషన్ 34 డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. వినుకొండ మున్సిపాలిటీ 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ గెలిచింది.

విజయనగరం: సాలూరు 4, 5, 6, 7 వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. పార్వతీపురం 12, 13 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది.

శ్రీకాకుళం: పలాస 6, 9, 15, 16 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. ఇచ్చాపురం 1, 6, 7 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.

చిత్తూరు కార్పొరేషన్‌లో వైఎస్ఆర్‌సీపీ ఆధిక్యత కొనసాగుతుంది. 50 డివిజన్లకు గాను 37 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

కదిరి 30వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి విజయం సాధించారు. 970 ఓట్లతో గులాబ్‌ జాన్‌ గెలుపొందారు.

ఆత్మకూరు మున్సిపాలిటీ 19వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.

కర్నూలు: ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 24 వార్డుల్లో ఇప్పటికే 20 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది.

పశ్చిమగోదావరి: నరసాపురం 23వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. నిడదవోలు 6వ వార్డులో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

కర్నూలు జిల్లా డోన్‌ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 32 వార్డులకు గాను ఇప్పటికే 30 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

పాలకొండ నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

పార్వతీపురం మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

బొబ్బిలి మున్సిపాలిటీలో ఒక వార్డులో వైఎస్సార్‌ సీపీ గెలుపు

యలమంచిలి మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

అమలాపురం మున్సిపాలిటీ 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

రామచంద్రపురం మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

సామర్లకోట మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

తుని మున్సిపాలిటీలో 15 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

ముమ్మిడివరం నగర పంచాయతీ 1 వార్డులో వైఎస్సార్‌ సీపీ గెలుపు

కొవ్వూరు మున్సిపాలిటీలో 13 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

నరసాపురం మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

తెనాలి మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

చిలకలూరిపేట మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

రేపల్లె మున్సిపాలిటీలో 4 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

సత్తెనపల్లి మున్సిపాలిటీలో 4 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

వినుకొండ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

కనిగిరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 14 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

నాయుడుపేట మున్సిపాలిటీలో 23 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

ఆత్మకూరు మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

వెంకటగిరి మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

నూజివీడు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

తిరువూరు నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

గుంతకల్లు మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

తాడిపత్రి మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 9 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 13 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీగెలుపు

జమ్మలమడుగు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

బద్వేల్ మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు

ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీలు వైఎస్సార్‌ సీపీ కైవసం

పులివెందుల, మాచర్ల మున్సిపాలిటీలు వైఎస్సార్‌ సీపీ కైవసం

పుంగనూరు, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు వైఎస్సార్‌సీపీ కైవసం

ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయితీలో 2,3,7 వార్డులను టీడీపీ గెలుచుకుంది. మొత్తం 20 వార్డుల్లో ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల్లో టీడీపీ అభ్యర్థులు 3 వార్డులు, వైసీపీ అభ్యర్థులు 7 వార్డులు గెలుచుకున్నారు.

విజయనగరం జిల్లా నెలిమర్ల మున్సిపాలిటీలో వైసీపీ అభ్యర్థి మహాలక్ష్మీ ఓటమి పాలయ్యారు. నెలిమర్లలో మొత్తం 20 వార్డులు ఉండగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

విశాఖ కార్పొరేషన్ 11 వార్డు జనసేన అభ్యర్థి గోనె భారతి గుండెపోటుతో మృతి చెందారు.

పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను లెక్కించి నేడు ఫలితాలు ప్రకటించనున్నారు.

రాత్రి 8 గంటల లోపు ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.