AP Local Body Polls: ముగిసిన మూడో దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మొదలైన ఓట్ల లెక్కింపు, ఓటువేసేందుకు వెళ్తున్న జీపు బోల్తా, పలువురికి గాయాలు

ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌లో (AP Local Body Polls) పాల్గొన్నారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగింది. చివరి గంటలో క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

Telangana Civic Polls 2020 | (Photo-PTI)

Amaravati, Feb 17: ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌లో (AP Local Body Polls) పాల్గొన్నారు. ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగింది. చివరి గంటలో క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. కోవిడ్‌ పాజిటివ్‌ బాధితులకు పోలింగ్‌ చివరిలో గంట పాటు కరోనా జాగ్రత్తలతో ఓటు వేసేందుకు అనుమతించారు. ఎన్నికలు ముగిసే సమయానికి శ్రీకాకుళం 75.70, విజయనగరం 84.6, వెస్ట్ గోదావరి 79.31, కృష్ణా 79.60, గుంటూరు 81.9, ప్రకాశం 79.31, నెల్లూరు 79.63, చిత్తూరు 77.31, కడప 68.42, కర్నూలు 79.90, అనంతపురం 78.32 శాతం పోలింగ్‌ నమోదైంది.

కాగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన జమిగూడ, బొంగరం, లింగేటి తదితర పంచాయతీల్లో (Panchayat Elections in AP) ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 1:30 గంటలకే పోలింగ్‌ ముగిసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన కుక్కునూరు, వేలేరుపాడు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పరిధిలో పోలింగ్‌ ప్రక్రియ ముగిసింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ముంచంగిపుట్టు మండలం వుబ్బంగి నుంచి లక్ష్మీపురం వెళ్తున్న జీపు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ఓటర్లకు గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని చికిత్స నిమిత్తం పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

విశాఖలో ఏపీ సీఎం, స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో భేటి, అనంతరం శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి, అయిదు రోజుల పాటు శారదా పీఠం వేడుకలు

సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా మొదట వార్డుల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 63,270 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. మూడో విడతలో మొత్తం 3,221 గ్రామ పంచాయతీలలో ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ కాగా.. అందులో 57 9 సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,639 సర్పంచ్‌ పదవులకు బుధవారం పోలింగ్ జరిగింది. ఈ స్థానాల్లో మొత్తం 7,757 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43,612 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

భారీగా నమోదైన ఏకగ్రీవాలు, నాలుగు విడతల్లో 2,192 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం, నాలుగవ విడతలో 549 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నిక

రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్‌ కేంద్రాల్లో మూడో విడత పోలింగ్‌ జరిగింది. ఇందులో 3,127 పోలింగ్‌ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా, మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 1,977 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏపీలో మొత్తం నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడత ఎన్నికలు నేడు జరగనుండగా... నాలుగో విడత ఫిబ్రవరి 21న జరగనుంది.



సంబంధిత వార్తలు

Sex in Michelle Obama's Bathroom': బరాక్ ఒబామా భార్య మిచెల్ ఒబామా బాత్‌రూమ్‌లో ప్రియురాలితో సెక్స్‌ కోసం ప్రయత్నించిన యూఎస్ సీక్రెట్ ఏజెంట్, షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Weather Forecast in Telugu States: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. ఆంధ్రప్రదేశ్‌ లో భారీ వర్షాలు.. తెలంగాణలో జల్లులు.. రెండు రోజులు ఇలాగే..!

Karthika Pournami 2024 Wishes In Telugu: నేడే కార్తీక పౌర్ణమి. ఈ పర్వదినంనాడు లేటెస్ట్ లీ తెలుగు అందించే ప్రత్యేక హెడ్ డీ ఇమేజెస్ ద్వారా మీ బంధు, మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయండి..!

CM Revanth Reddy: యువతరాన్ని ప్రోత్సహించాలి... శాసనసభకు పోటీ చేసే వయస్సు 21 ఏళ్లకు తగ్గించాలన్న సీఎం రేవంత్ రెడ్డి, యువత డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపు