AP Coronavirus: ఏపీలో కరోనా కల్లోలం, ఒక్కరోజే 11 మంది మృతి, గడచిన 24 గంటల్లో 2,331 కరోనా కేసులు నమోదు, కృష్ణా జిల్లాలో 327, విశాఖ జిల్లాలో 298, చిత్తూరు జిల్లాలో 296, అనంతపురం జిల్లాలో 202 కేసులు నమోదు
గడచిన 24 గంటల్లో 31,812 కరోనా పరీక్షలు చేపట్టగా 2,331 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని వెల్లడైంది. అనేక జిల్లాల్లో మూడంకెల్లో కొత్త కేసులు వచ్చాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు.
Amaravati, April 7: ఏపీలో కరోనా మరింతగా విస్తరిస్తోంది. గడచిన 24 గంటల్లో 31,812 కరోనా పరీక్షలు చేపట్టగా 2,331 మందికి పాజిటివ్ (AP Coronavirus) అని వెల్లడైంది. అనేక జిల్లాల్లో మూడంకెల్లో కొత్త కేసులు వచ్చాయి. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. కృష్ణా జిల్లాలో 327, విశాఖ జిల్లాలో 298, చిత్తూరు జిల్లాలో 296, అనంతపురం జిల్లాలో 202 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 853 మంది కోలుకోగా... 11 మంది మహమ్మారికి బలయ్యారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే నలుగురు మృత్యువాతపడ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 7,262కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,13,274 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,92,736 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,276 మంది చికిత్స పొందుతున్నారు.
దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 1,15,736 కొవిడ్ పాజిటివ్ కేసులు (India Coronavirus) నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. ఒకే రోజు 630 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు (Covid in India) చేరింది. కొత్తగా 59,856 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 1,17,92,135 మంది కోలుకున్నారు. వైరస్ ప్రభావంతో ఇప్పటి వరకు 1,66,177 మృతి (Covid Deaths) చెందారు. ప్రస్తుతం దేశంలో 8,43,473 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.
గతంతో పోలిస్తే వైరస్ వేగంగా వ్యాపిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. వచ్చే నాలుగు వారాలు అత్యంత కీలక సమయమని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ నిబంధనలు పాటించాలని హెచ్చరించింది. ఈ మేరకు మంగళవారం నీతిఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో రెండో దశ కరోనా ఉద్ధృతిని (సెకండ్ వేవ్‌ను) అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని తెలిపారు. దేశంలో అన్ని వయసుల వారికి వ్యాక్సిన్ వేయాలన్న డిమాండ్‌లపై పాల్ స్పందించారు. వైరస్ ప్రమాదం ఎక్కువగా ఉన్నవారికే తొలుత టీకాను ఇస్తామన్నారు. వ్యాక్సిన్ వేసుకోవాలనుకుంటున్నవారికంటే, టీకా అవసరమైన వారికే తమ ప్రాధాన్యత ఉంటుందన్నారు.