AP coronavirus: కరోనాపై ఏపీలో భారీ ఊరట, రెండు లక్షలు దాటిన డిశ్చార్జ్ కేసులు, యాక్టివ్ కేసులు 84,777, గత 24 గంటల్లో 6,780 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య (Coronavirus Cases) 2,09,100కి పెరిగింది. గత 24 గంటల్లో 44,578 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 6,780 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు తెలిపింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు సంఖ్య 2,96,609కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 29,05,521 కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు. యాక్టివ్ కేసులు 84,777 ఉన్నాయి. తాజాగా 82 మంది మృతితో మొత్తం మరణాలు 2732కి చేరాయి.
Amaravati, August 17: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 7,866 మంది కోవిడ్ (AP coronavirus)నుంచి పూర్తిగా కోలుకున్నారని వైద్యారోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య (Coronavirus Cases) 2,09,100కి పెరిగింది. గత 24 గంటల్లో 44,578 శాంపిల్స్ పరీక్షించగా కొత్తగా 6,780 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు తెలిపింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు సంఖ్య 2,96,609కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 29,05,521 కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించారు. యాక్టివ్ కేసులు 84,777 ఉన్నాయి. తాజాగా 82 మంది మృతితో మొత్తం మరణాలు 2732కి చేరాయి.
కర్నూలు జిల్లాలో ఇవాళ కొత్తగా 372 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఐదుగురు చనిపోయారు. మొత్తంగా జిల్లాలో ఇప్పటి వరకు 33,952 కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్ కేసులు 7248 ఉన్నాయి. 26407 మంది డిశ్చార్జ్ అయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కారణంగా 297 మంది మరణించారు. వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోంది, ప్రధాని మోదీకి లేఖ రాసిన ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు
దేశంలో గత 24 గంటల్లో 57,982 కొత్త కేసులు నమోదడంతో మొత్తం కేసుల సంఖ్య (Coronavirus in India) 26 లక్షలు దాటింది. తాజాగా 941 మంది కరోనాతో మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 50,921 కి (Coronavirus Deaths) చేరింది. తాజాగా నమోదైనవాటితో కలిపి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 26,47,664 కు చేరింది. ప్రస్తుతం 6,76,900 మంది వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 19,19,843 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 7 లక్షల 30 వేల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంతో.. మొత్తం పరీక్షల సంఖ్య మూడు కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సోమవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.