AP Covid Report: సెకండ్ వేవ్ కల్లోలం, ఏపీలో తాజాగా 23,920 మందికి కరోనా, 83 మంది మృతితో 8,136కి చేరుకున్న మరణాల సంఖ్య, కొత్తగా 11,411 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్
నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు (AP Covid Report) నమోదువుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 23,920 పాజిటివ్ కేసులు (APNew Covid Cases) నమోదయ్యాయి. 83 మంది ప్రాణాలు కోల్పోయారు.
Amaravati, May 2: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కల్లోలం ఆగడం లేదు. నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు (AP Covid Report) నమోదువుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 23,920 పాజిటివ్ కేసులు (APNew Covid Cases) నమోదయ్యాయి. 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మొత్తం కొవిడ్ పాజిటివ్ కేసులు 11,45,022కు పెరిగాయి. మరణించిన వారి సంఖ్య 8,136కి (Covid Deaths) చేరింది.
రాష్ట్రంలో సెకండ్ వేవ్ మొదలైన తర్వాత తొలిసారి 23వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1,14,299 పరీక్షలు నిర్వహించగా.. 23,920 కేసులు నిర్ధారణ కాగా.. 83 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 11,45,022 మంది వైరస్ బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,66,02,873 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
కొవిడ్‌తో తూర్పు గోదావరిలో 12 మంది; విశాఖ, అనంతపురం, కృష్ణాలో 8 మంది చొప్పున; ప్రకాశం, విజయనగరంలో ఏడుగురు చొప్పున; చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరిలో ఆరుగురు చొప్పున; గుంటూరులో ఐదుగురు; కర్నూల్‌లో నలుగురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 8,136కి చేరింది.
Here's AP Covid Report
24 గంటల వ్యవధిలో 11,411 మంది బాధితులు కోలుకోవడంతో కోలుకున్న వారి సంఖ్య 9,93,708కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,43,178 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా చిత్తూరులో 2,945 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో వెయ్యికిపైగా బాధితులు వైరస్ బారినపడ్డారు.