AP Shocker: ప్రియుడితో రాసలీలలకు భర్త అడ్డు, నిద్రపోతుండగా ప్రియుడితో కలిసి కుక్కర్‌తో కొట్టి చంపేసిన భార్య, మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టిన కసాయి

ప్రియుడు మోజులో కట్టుకున్న భర్తని దారుణంగా ( Woman gets husband killed) చంపేసింది. భర్త అడ్డును తొలగిస్తే మన సంబంధానికి (extra-marital relationship) అడ్డే ఉండదంటూ ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి ఓ కిరాతక భార్య పాల్పడింది.

Representational Image | (Photo Credits: IANS)

Vizag, July 21: విశాఖపట్నంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడు మోజులో కట్టుకున్న భర్తని దారుణంగా ( Woman gets husband killed) చంపేసింది. భర్త అడ్డును తొలగిస్తే మన సంబంధానికి (extra-marital relationship) అడ్డే ఉండదంటూ ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి ఓ కిరాతక భార్య పాల్పడింది. పోలీసులు తెలిపన వివరాల ప్రకారం.. మురళికి పదేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన మృదుల అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఏడేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఈ దశలో ఉపాధి రీత్యా మురళి సౌత్ ఆఫ్రికాలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ఇంటికి దూరంగా ఉంటున్న దశలో మృదులకు ఆమె నివాసం ఉంటున్న రిక్షా కాలనీలో శంకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

వీరిద్దరి మధ్య ఏడాది కాలంగా సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసి ప్రశ్నించిన మురళిపై అతని భార్య వేధింపుల కేసు కూడా పెట్టింది. ఈ దశలో సెలవుపై ఈనెల తొమ్మిదో తేదీన మురళి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చారు. ఈ దశలో మృదుల 60 రోజుల పాటు నా భర్త మురళి విశాఖలో ఉంటారని మనిద్దరం కలిసే అవకాశం ఉండదని శంకర్‌తో చెప్పింది. అంత కాలం దూరంగా ఉండలేమని నీ భర్తను హత్య చేస్తే జీవితకాలం కలిసి ఉండొచ్చని శంకర్ మృదులకు చెప్పాడు.

తాగొచ్చి భార్యను కొట్టాడు, అలిగి పుట్టింటికి వెళ్లిందని ఆత్మహత్య చేసుకున్నాడు, నార్సింగి ప్లైఓవర్‌పై నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు పైకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి

అనుకున్నదే తడవుగా..వీరిద్దరూ ఇంట్లో నిద్రపోతున్న భర్తను చంపేయాలని నిర్ణయించారు. భర్త నిద్రపోతుండగా కుక్కర్‌తో తలపై చితకబాదింది. ఈ దారుణానికి ప్రియుడు శంకర్‌ సహకరించాడు. వీరిద్దరూ కలిసి ప్రాణం పోయేంత వరకు మురళిని తీవ్రంగా కొట్టారు. అనంతరం మృతదేహాన్ని మూటగట్టి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మారికవలస గడ్డలో స్కూటీపై వెళ్లి పడేశారు. రజకుల బట్టల మూటగా నమ్మించే రీతిన మృతదేహాన్ని దుప్పట్లో కట్టేశారు.

యూట్యూబ్‌లో వ్యూస్ రావడం లేదని యువకుడు ఆత్మహత్య, నాలాగా తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని సూసైడ్ లెటర్

మూడు రోజుల తర్వాత మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో ఓ రాత్రి ప్రియుడు మృదుల ఇద్దరూ వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అయితే ఇంటికి వస్తానన్న కొడుకు రాకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. ఆమె కోడలిని గట్టిగా ప్రశ్నించడంతో భర్త మురళి కనిపించడం లేదని పీఎం పాలెం పోలీసులకు మృదుల ఫిర్యాదు (files missing case) చేసింది. ఈ నేపథ్యంలో అన్ని వైపుల నుండి విచారణ సాగించిన పోలీసులు నిజాన్ని ఆమె ద్వారా రాబట్టారు. ఇద్దరూ కలిసి నా భర్తను చంపేశామని పోలీసుల విచారణలో నిందితురాలు తెలిపింది.