APPSC Group-1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీ ఎప్పుడంటే..

తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుండి 9 వరకు (7వ తేదీ మినహా) పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే అభ్యర్ధుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్‌సీ తెలిపింది.

APPSC Logo(Photo-File Image)

గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుండి 9 వరకు (7వ తేదీ మినహా) పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే అభ్యర్ధుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్‌సీ తెలిపింది. సవరించిన షెడ్యూల్ ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.వేలాదిగా వస్తున్న అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్... జూన్‌ లో ఓసారి, డిసెంబర్‌ లో మరోసారి నిర్వహణ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

ఏపీలో మొత్తం 81 గ్రూపు 1 పోస్టుల భర్తీకి గానూ మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఏప్రిల్‌ 12వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్‌ 1 పరీక్షకు మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకోగా.. వీరిలో 91,463 మంది పరీక్షకు హాజరయ్యారు. అయితే ఫలితాల్లో మాత్రం 1:50 చొప్పున 4,496 మంది అభ్యర్ధులు మాత్రమే మెయిన్స్‌ రాసేందుకు అనుమతించారు. ఈ పరిస్థితుల నడుమ 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేయాలని డిమాండ్స్ లేవనెత్తారు విద్యార్థులు. ఈ సమస్యపై దృష్టి పెట్టిన ఏపీపీఎస్సీ తాజాగా మెయిన్స్ వాయిదా వేసింది. త్వరలోనే దీనిపై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం 81 గ్రూప్ 1 ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది ఏపీపీఎస్సీ.



సంబంధిత వార్తలు

KTR On Adani Issue: అదానితో కాంగ్రెస్ - బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం, తెలంగాణలో అదాని పెట్టుబడుల వెనుక కాంగ్రెస్ వాట ఎంతో బయట పెట్టాలని కేటీఆర్ డిమాండ్

Gautam Adani Charged in Bribery Case: వ్యాపారాల కోసం రూ.2,236 కోట్లు లంచం, అమెరికాలో అదానిపై మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు, కుప్పకూలిన అదాని గ్రూప్ షేర్లు

Mohini Dey Announced The Divorce: గురువు బాట‌లోనే ఏఆర్ రెహ‌మాన్ శిష్యురాలు, ఆయ‌న విడాకులు ప్ర‌క‌టించిన గంటల వ్య‌వ‌ధిలోనే సంచ‌ల‌న పోస్ట్, నెట్టింట తీవ్ర‌మైన చ‌ర్చ‌

AP Cabinet key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, కర్నూల్‌లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం, ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు