APPSC Group-I Services Interview 2021: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే, తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని ఆదేశాలు, హైకోర్టు తీర్పుతో ఇంటర్వ్యూలు వాయిదా

గ్రూప్‌-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గురువారం నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు కూడా నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టును (Andhra Pradesh High Court) ఆశ్రయించారు.

High Court of Andhra Pradesh | File Photo

Amaravati, June 16: గ్రూప్‌-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గురువారం నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు కూడా నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టును (Andhra Pradesh High Court) ఆశ్రయించారు.

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల జవాబు పత్రాలను డిజిటల్‌ విధానంలో వాల్యుయేషన్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. షెడ్యూల్‌ ప్రకారం రేపటి నుంచి ఇంటర్వ్యూలు (APPSC Group-I Services Interview 2021) జరగాల్సి ఉండగా హైకోర్టు తీర్పుతో వాయిదా పడింది. నాలుగు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ఏపీ ప‌బ్లిక్ క‌మిష‌న్‌ను ఆదేశించింది.నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టులో వాదప్రతివాదనలు జరిగాయి. కొద్దిసేపటి హైకోర్టు క్రితం తీర్పు ఇచ్చింది. ఈ పిటిషన్‌లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలిచ్చింది.

జూన్ 20 తర్వాత ఏపీలో కొన్ని సడలింపులతో కర్ఫ్యూ, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్, స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్

కాగా గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం పరీక్షలు జరగలేదని పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. డిజిటల్‌ వాల్యూయేషన్‌ గురించి చివరి దశలో చెప్పారన్నారు.

అయితే నిబంధనల ప్రకారమే గ్రూప్‌-1 పరీక్షలు జరిగాయని, వాల్యూయేషన్‌ గురించి ముందుగా చెప్పాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరపున వ్యాయవాది వాదనలు హైకోర్టుకు తెలిపారు. ఇక ఇరు వాదనలు విన్న హైకోర్టు మంగళవారం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. గ్రూప్‌-1 ఇంటర్వ్యూ ప్రక్రియపై స్టే విధిస్తూ ఇవాళ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.