Justice Arup Goswami: ఏపీ హైకోర్టు సీజేగా అరూప్ గోస్వామి ప్రమాణం, జస్టిస్ గోస్వామిచే ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, హాజరయిన సీఎం వైయస్ జగన్, ఏపీ కొత్త సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ తదితరులు
జస్టిస్ గోస్వామిచే రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీజేగా గోస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.
Amaravati, Jan 6: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ గోస్వామి (AP High Court Chief Justice) ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ గోస్వామిచే రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సీజేగా గోస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. నేడు ఉదయం సీజే అరూప్ కుమార్ గోస్వామితో (Justice Arup Goswami) కలిసి సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Bishwabhushan Harichandan) కలిసి తేనీటి విందులో పాల్గొన్నారు.
అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం వైఎస్ జగన్ (CM YS Jaganmohan Reddy) పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సహా పలువురు న్యాయమూర్తులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.అంతకుముందు అనూప్ కుమార్ గోస్వామి సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు.
Here's Justice Arup Kumar Goswami Sworn Event
హైకోర్టుకు (Andhra Pradesh High Court) కొత్త న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అరూప్ గోస్వామి (Justice Arup Goswami) 1961 మార్చి 11న అసోంలోని జోర్హాట్‌లో జన్మించారు. గువాహటి ప్రభుత్వ న్యాయకళాశాల నుంచి 1985లో న్యాయశాస్త్ర పట్టా పొందారు.1985 ఆగస్టు 16న న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు. సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, ఉద్యోగ సేవలకు సంబంధించిన విభిన్న కేసులను ఆయన వాదించారు. గువాహటి హైకోర్టులో 2011లో అదనపు న్యాయమూర్తిగా, 2012లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
2019 అక్టోబరు 15న పదోన్నతిపై సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 2004 డిసెంబరు 21న గువాహటి హైకోర్టు నుంచి సీనియర్ అడ్వొకేట్ హోదా పొందారు. 2011 నుంచి 2013 వరకు నాగాలాండ్ రాష్ట్ర న్యాయసేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరించారు. 2018 నుంచి రెండుసార్లు గువాహటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఇప్పుడు ఏపీ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.