Beach Picnic Turns Tragic: శ్రీకాకుళంలో విషాదం, కళింగపట్నం బీచ్‌లో స్నానాలకు వెళ్లిన ఆరుగురు యువకులు గల్లంతు, గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు, వీరంతా చైతన్య కాలేజి విద్యార్థులు

సరదాగా సముద్రం చూసొద్దామని వెళ్లిన యువకులు అలల ధాటికి గల్లంతయ్యారు. సముద్రంలో దిగిన ఆరుగురు ఇంటర్ విద్యార్థులు గల్లంతవడంతో బీచ్‌లో భయాందోళన నెలకొంది. గార మండలం కళింగపట్నం బీచ్‌లో స్నానాలకు వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతయ్యారు.

Beach picnic turns tragic As 6 Inter students drown in sea at Srikakulam (Photo-Twitter)

Srikakulam, November 11: శ్రీకాకుళం(Srikakulam) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్రం చూడటానికి వెళ్లిన యువకులు అలల ధాటికి గల్లంతయ్యారు. సముద్రంలో దిగిన ఆరుగురు ఇంటర్ విద్యార్థులు గల్లంతవడంతో బీచ్‌లో భయాందోళన నెలకొంది. గార మండలం కళింగపట్నం బీచ్‌(Kalingapatnam Beach)లో స్నానాలకు వెళ్లి ఆరుగురు యువకుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. మరొకరు చనిపోాయారు. మిగిలిన నలుగురు యువకులు (Beach picnic turns tragic) గల్లంతయ్యారు. వారి కోసం గజ ఈతగాళ్లు వెతుకుతున్నారు.

శ్రీకాకుళం పట్టణంలోని చైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న ఆరుగురు విద్యార్థులు సముద్ర స్నానం కోసం కళింగపట్నం బీచ్‌కి వచ్చారు. అంతా సముద్రంలో దిగి కేరింతలు కొడుతుండగా తీవ్రమైన అలలు రావడంతో ఒక్కసారిగా వీరు గల్లంతయ్యారు. నీటమునుగుతూ కేకలు వేయడంతో అక్కడి వారు చూసి పోలీసులకు సమాచారం అందించారు.

ఆరుగురు యువకులు గల్లంతు

లింగాల రాజ సింహం, షేక్ అబ్దుల్లా,ప్రవీణ్ కుమార్ రెడ్డి, యజ్ఞమయ పండా, కురుమూరి సందీప్, అనపర్తి సుందర్ బీచుకు వెళ్లిన వారిలో ఉన్నారు. వీరిలో రాజసింహ ప్రాణాలతో బయటపడ్డాడు.

మెరైన్‌ సీఐ అంబేడ్కర్, ఇన్‌చార్జి ఎస్సై సింహాచలం, స్థానిక మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎస్పీ అమ్మిరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాలింపు చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు అబ్దుల్లా, రాజసింహతో మాట్లాడి సంఘటన తీరును తెలుసుకున్నారు. డీఎస్పీ మూర్తి, శ్రీకాకుళం పట్టణ సీఐ లలిత, తహసీల్దార్‌ జెన్ని రామారావు, మెరైన్‌ ఎస్‌ఐ జగన్‌ తదితరులు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.