Anakapalli Road Accident: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి వేగంగా ఢీ కొట్టిన లారీ, 20 మందికి గాయాలు, ఒకరు మృతి

జిల్లాలోని ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయాలు అయ్యాయి.

Representational Image (File Photo)

Dharmavaram, Feb 24: ఏపీలో అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Anakapalli Road Accident:) చోటు చేసుకుంది. జిల్లాలోని ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మందికి పైగా గాయాలు అయ్యాయి. అనకాపల్లి నుంచి పాయకరావుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ధర్మవరం వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. అదే సమయంలో వెనకనుంచి వచ్చిన లారీ బలంగా ఢీకొనడంతో బస్సు అదుపుతప్పి ముందు ఉన్న మరో ఆటోను ఢీకొట్టి పంటకాలువలోకి దూసుకెళ్లింది.

పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, 11 మంది అక్కడికక్కడే మృతి, మరో 10 మందికి తీవ్ర గాయాలు

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 20మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు కలిసి క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోల్లో తరలించారు. విశాఖలోని ఇసుకతోటకు చెందిన పరసయ్య (55) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.