ఛత్తీస్‌గఢ్‌లోని బలోడా బజార్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. బలోడా బజార్ జిల్లాలోని భాటపరా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఖమారియా ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, పికప్ వ్యాన్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పికప్ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న 11 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో పది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికు తరలించారు. బాధితులంతా ఓ వివాహ వేడుకలో పాల్గొని వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వారంతా సింగా సమీపంలోని ఖిలోరా గ్రామానికి చెందినవారని చెప్పారు.
Here's ANI Tweet
11 killed, several others injured in collision between truck and pickup vehicle in Chhattisgarh's Baloda Bazar
Read @ANI Story | https://t.co/4ofrvVj3AY#RoadAccident #Chhattisgarh #BalodaBazar #injured pic.twitter.com/sQW9o0shBv
— ANI Digital (@ani_digital) February 24, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)