People Fell Sick in Eluru: ఏలూరు అంతు చిక్కని వ్యాధికి కారణం అదేనా? ఘటనపై ఏపీ సీఎం వైయస్ జగన్ ఆరా, రెండో సారి బాధితులను పరామర్శించిన ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, నీటి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపిన అధికారులు

ఇప్పటివరకు 227 కేసులు నమోదయ్యాయి. ఇంకా మూర్ఛ, వాంతులు వంటి బాధితులు (People Fall Sick in Eluru) పెరుగుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలోనే కాకుండా ప్రయివేట్ ఆసుపత్రుల్లో వీరు చేరారు. ఇప్పటివరకూ70 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. బాధితుల్లో 105 మంది పురుషులు, 76 మంది స్త్రీలు, 46 మంది చిన్నారులు ఉన్నారు.

People Fell Sick in Eluru (Photo-ANI)

Eluru, Dec 6: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుతో అంతుచిక్కని వ్యాధి (People Fell Sick in Eluru) రెండు రోజుల నుంచి కలకలం రేపుతున్న సంగతి విదితమే. ఇప్పటివరకు 227 కేసులు నమోదయ్యాయి. ఇంకా మూర్ఛ, వాంతులు వంటి బాధితులు (People Fall Sick in Eluru) పెరుగుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలోనే కాకుండా ప్రయివేట్ ఆసుపత్రుల్లో వీరు చేరారు. ఇప్పటివరకూ70 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. బాధితుల్లో 105 మంది పురుషులు, 76 మంది స్త్రీలు, 46 మంది చిన్నారులు ఉన్నారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan) ఫోన్‌లో ఆరా తీశారు. డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని (Health Minister Alla kali Srinivas) ప్రస్తుత పరిస్థితులను, బాధితుల వివరాలను సీఎం జగన్‌కు వివరించారు. ఈ సందర్భంగా సకాలంలో స్పందించి, బాధితులకు బాసటగా నిలిచి.. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ముందస్తు చర్యలు చేపట్టిన మంత్రి నానిని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు గవర్నమెంట్‌ ఆస్పత్రిలో (Eluru Government Hospital) వైద్యబృందం, జిల్లా యంత్రాంగం, అధికారుల పనితీరును సీఎం జగన్‌ అభినందించారు. రాత‍్రంతా మేల్కొని గవర్నమెంట్‌ ఆస్పత్రిలో బాధితులపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న మంత్రి ఆళ్ల నాని పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

అంతుపట్టని వ్యాధితో వణుకుతున్న ఏలూరు, ఫిట్స్‌ మాదిరి నోటి వెంట నురగతో పడిపోతున్న ప్రజలు, భయపడాల్సిందేమి లేదని తెలిపిన వైద్యులు

కాగా, ఏలూరులో వివిధ లక్షణాలతో అనారోగ్యానికి గురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరిన బాధితులకు అన్నివిధాలుగా అండగా ఉంటాం. వ్యాధి లక్షణాలను పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఏలూరుకు వైద్యబృందాలను పంపిస్తున్నాం. ఎలాంటి భయాందోళన చెందొద్దు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా నిపుణులయిన వైద్య పరీక్షలు చేయిద్దాం. అవసరమయితే మెరుగైన వైద్యసదుపాయం కల్పించడం కోసం అన్ని విధాలుగా అండగా ఉంటాం. ప్రత్యేక వైద్యబృందాలు ఈ ఉదయం ఏలూరుకు వస్తున్నాయి. అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలన చేస్తారు. ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటునందిస్తుందని సీఎం వైఎస్‌ జగన్‌ మంత్రి ఆళ్లనానికి భరోసా ఇచ్చారు

అస్వస్థతకు గురై ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఆళ్ల నాని ఆదివారం ఉదయం మరోసారి పరామర్శించారు. వార్డులో ఉన్న ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులతో పాటు, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. కేసుల వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశాం. ఇంటింటి సర్వే చేసి ఆరోగ్య పరిస్థితి సమీక్షిస్తున్నాం. మెరుగైన వైద్యం కోసం కొందరిని విజయవాడ తరలించాం. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు

ఎవరికీ ప్రాణపాయం లేదని వైద్యులు చెబుతున్నారు. చికిత్స అనంతరం సాధారణ స్థితికి వస్తున్నారు. నీటి నమూనా సేకరించిన రాష్ట్ర స్థాయి ల్యాబ్‌కు పంపాం. నీటిలో కాలుష్యం లేదని నివేదికలో తేలింది. బాధితుల రక్త నమునాలు సేకరించి ల్యాబ్‌కు పంపాం. ఎలాంటి వైరస్‌ కారణాలు లేవని తేలింది. మరికొన్ని రిపోర్టులు రావాల్సి ఉంది. వచ్చాక కారణాలు తెలుస్తాయి. ఈ పరిస్థితికి కారణాలను ఆన్వేషిస్తున్నాం. స్వయంగా ముఖ్యమంత్రి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు’ అని మంత్రి తెలిపారు.

ఈ వింతవ్యాధిని మాస్ హిస్టీరియాగా మానసిక వైద్యులు భావిస్తున్నారు. దాంతో ఏలూరు పరిసరాల్లో తాగునీటి శాంపిల్స్‌ను అధికారులు సేకరించారు. బాధితులకు కరోనాతో పాటు ఇతర వైద్య పరీక్షలు చేశారు. ఏలూరులోని గొల్లాయగూడెం, కొత్తపేట, శనివారపుపేట, కొబ్బరితోట, పడమరవీధి, దక్షిణపువీధి ప్రాంతాల్లో భాధితులు అత్యధికంగా ఉన్నారు. కాలనీల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో బాధితులను మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు.



సంబంధిత వార్తలు

Priyanka Gandhi Vadra Leading in Wayanad: వయనాడ్‌ లో 46 వేల ఓట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న ప్రియాంక గాంధీ.. మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య పోటీ హోరాహోరీ

Heavy Rains in AP: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం.. వచ్చే వారం ఏపీలో దంచికొట్టనున్న వానలు.. ఐఎండీ అంచనా.. ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో పెరగనున్న చలి తీవ్రత

Hospital Horror: కంటిలో నలక పడిందని వస్తే, సర్జరీ అన్నారు.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు.. హైదరాబాద్ లో ప్రైవేటు కంటి దవాఖాన ముందు బంధువుల ఆందోళన (వీడియో)

Rajasthan: అంత్యక్రియల సమయంలో చితిమంటల మీద నుంచి లేచిన యువకుడు చికిత్స పొందుతూ మృతి, నలుగురి వైద్యులను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు