Miss Universe India Contestant: మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు కుప్పం యువతి చందన.. సీఎం చంద్రబాబు అభినందనలు
మిస్ యూనివర్స్–ఇండియాకు ఏపీ నుంచి ఆమె అర్హత సాధించారు.
Kuppam, Aug 3: ఏపీలోని (AP) కుప్పం (Kuppam) నియోజకవర్గంలోని ఎంకే పురానికి చెందిన యువతి చందన జయరాం అరుదైన గుర్తింపు సాధించారు. మిస్ యూనివర్స్–ఇండియాకు (Miss Universe India Contestant) ఏపీ నుంచి ఆమె అర్హత సాధించారు. ఈ క్రమంలో శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి సచివాలయంలో సీఎం చంద్రబాబును చందన కలిశారు. ఈ సందర్భంగా కుప్పం పేరును జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చందనకు చంద్రబాబు అభినందనలు తెలియజేశారు. ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో చందన మిస్ యూనివర్స్ ఇండియాకు రాష్ట్రం నుంచి ఎంపిక అయ్యారు. తన నియోజకవర్గం కుప్పం నుంచి మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు చందన అర్హత సాధించడంపై సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు.
వచ్చే నెలలో పోటీలు
ముంబైలో వచ్చే నెలలో జరిగే మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో చందన మిగతా పోటీదారులతో జరిగే కాంపిటిషన్ లో పాల్గొననున్నారు. ఇందులో విజేతగా గెలిస్తే, మిస్ యూనివర్స్ పోటీలో భారత్ నుంచి ఆమె అధికారికంగా పాల్గొననున్నారు.