CM Chandrababu on Budget: వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ‌కు ఆక్సిజన్ ఈ బడ్జెట్, యూనియన్ బడ్జెట్‌పై చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన గుర్తింపు కలిగిందన్నారు. రూ.15 వేల కోట్లు అమరావతికి కోసం బడ్జెట్‌లో పెట్టారన్నారు.

Chandrababu Meets PM Modi (Photo-PTI)

Vjy, July 23: కేంద్ర బడ్జెట్‌లో (Budget 2024) ఏపీకి అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (CM Chandrabau Naidu)ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి తగిన గుర్తింపు కలిగిందన్నారు. రూ.15 వేల కోట్లు అమరావతికి కోసం బడ్జెట్‌లో పెట్టారన్నారు. పోలవరం నివేదికలో సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కట్టాలి అని చెప్పారని.. దీనికి కేంద్రం మద్దతు ఇస్తామని కూడా చెప్పారన్నారు. వెనకబడిన జిల్లాలో ప్రకాశం జిల్లాను కూడా చేర్చారన్నారు. ఎకనామిక్ గ్రోత్‌కు కూడా ముందుకు వచ్చారని తెలిపారు.  ఏపీ రాజధానిగా అమరావతి ఫిక్స్, రాజధాని అభివృద్ధికి రూ.15వేల కోట్ల ప్రత్యేక ఆర్ధిక సాయాన్ని ప్రకటించిన కేంద్రం, బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి వరాల జల్లు

వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ‌కు ఆక్సిజన్ ఇచ్చారని అన్నారు. ఆక్సిజన్ మాత్రమే ఇచ్చారని... ఇది ఆరంభం మాత్రమే అని సీఎం వెల్లడించారు. ఇందుకు అందరం కష్టపడాలని చెప్పారు. తొందరలోనే ఒక బడ్జెట్ ప్రవేశపెడతామని తెలిపారు. ఏపీకి ఉన్న వనరులు, సూపర్ సిక్స్ అమలుకు కూడా నిధులు కేటాయిస్తానని ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు 100 వరకు ప్రారంభిస్తామన్నారు. లాండ్ టైటలింగ్ యాక్ట్‌ను దుర్మార్గంగా ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దుర్మార్గుడు అధికారంలో ఉంటే ఏమి జరుగుతుంది అనేది ఈ చట్టం ద్వారా తెలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్ల ఆర్థిక సాయం, అవసరమైతే భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇస్తామని తెలిపిన కేంద్రమంత్రి నిర్మల

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించినందుకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీ ప్రజల తరఫున సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం, పారిశ్రామిక రంగాలపై దృష్టి సారించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం నుంచి వచ్చే సహకారం ఏపీ పునర్నిర్మాణానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రానికి విశ్వాసాన్ని పెంచే బడ్జెట్‌ను సమర్పించినందుకు కేంద్రాన్ని అభినందించారు. ఏపీ మళ్లీ గాడిలో పడుతోందని చంద్రబాబు పేర్కొన్నారు



సంబంధిత వార్తలు

CPI Narayana On Pushpa 2: అదో సినిమానా? స్మగ్లింగ్‌ ను గౌరవంగా చూపించే అలాంటి సినిమాకు మీరు రాయితీ ఇవ్వడమా? పుష్ప-2, తెలంగాణ ప్రభుత్వంపై సీపీఐ నారాయణ మండిపాటు

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif