YS Jagan on Train Accident: విజయనగరం రైలు ప్రమాదంపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సహాయ కార్యక్రమాలపై ఎప్పటికపుడు నివేదిక ఇవ్వాలని ఆదేశం
విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
Vijayanagaram, OCT 29: విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన ఘోర రైలు (train accident) ప్రమాదంపై ఏపీ సీఎం జగన్ (YS Jagan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్ రైలుకు ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం వచ్చిందని, ఈ ఘటనలో నాలుగు బోగీలు పట్టాలు తప్పినట్టుగా సమాచారం అందుతోందని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవెన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు (Recue) చేపట్టి, గాయపడ్డ వారికి సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలన్నారు.