E Autos For Garbage Collection: క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో మరో ముందడుగు, చెత్తసేకరణకు ఇకపై ఎలక్ట్రిక్‌ ఆటోలు, ఒకేసారి 516 ఈ ఆటోలు ప్రారంభించనున్న సీఎం జగన్‌మోహన్ రెడ్డి

ఈ క్రమంలో సీఎం కేసీఆర్ జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా చెత్తసేకరణ (Garbage Collection) ఈ-ఆటోలను ప్రారంభించింది. ఈ ఆటోలను (E Autos) సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించనున్నారు.

CM Jagan (photo-AP CMO)

Vijayawada, June 08: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్లీన్‌గా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా చెత్తసేకరణ (Garbage Collection) ఈ-ఆటోలను ప్రారంభించింది. ఈ ఆటోలను (E Autos) సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించనున్నారు. చెత్త సేకరణకు పర్యావరణహితంగా ఉండే 516 విద్యుత్ ఆటోలను (E Autos) ప్రభుత్వం కొనుగోలు చేసింది. 36 మున్సిపాలిటీలకు వీటిని అందజేస్తారు. ఒక్కో ఆటో విలువ రూ.4.10 లక్షలుకాగా, 500 కేజీల సామర్థ్యంతో వీటిని రూపొందించారు. ఆటోల కొనుగోలుకు ప్రభుత్వం రూ.21.18 కోట్లను వెచ్చించింది.

AP Cabinet Key Decisions: మొత్తం 63 అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం, ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పింఛన్ విధానం, ఏపీ గ్యారెంటెడ్‌ పెన్షన్‌ స్కీం అమలుకు ఆమోదం 

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలను స్వచ్ఛంగా ఉండేలా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే రూ. 72కోట్లతో 123 మున్సిపాలిటీల్లోని 40లక్షల కుటుంబాలకు ప్రభుత్వం తడి, పొడి, హానికర వ్యర్థాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లోని 120 లక్షల చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. గ్రేడ్ -1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్బేజ్ టిప్పర్లను ప్రభుత్వం వినియోగిస్తోంది.

AP Cabinet Meeting Highlights: కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, 2024 జూన్‌ 2 నాటికి ఐదేళ్లు పూర్తయిన వారి క్రమబద్దీకరణకు కేబినెట్‌ ఆమోదం 

గుంటూరు, విశాఖపట్టణాలలో వేస్ట్ టూ ఎనర్జీ ప్రాజెక్టులను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది. త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. అదేవిధంగా 81 మున్సిపాలిటీల్లో రూ. 157 కోట్లతో 135 గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్లు ప్రభుత్వం నిర్మిస్తుంది. పెద్ద, చిన్న మున్సిపాలిటీల్లో వీధులన్నీ శుభ్రంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇదిలాఉంటే చెత్తసేకరణలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్న ఈ ఆటోలకు డ్రైవర్లుగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh: వీడియో ఇదిగో, ఘోర రోడ్డు ప్రమాదంలో 150 గొర్రెలు మృతి, పొగ మంచులో రోడ్డు మీద వెళ్తున్న మందను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు

MP Kiran Kumar Reddy: అల్లు అర్జున్‌పై ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్, బన్నీ రియల్ హీరో కాదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివారని ఆగ్రహం వ్యక్తం చేసిన భువనగిరి ఎంపీ

Andhra Pradesh Shocker: కొడుకును సుపారీ ఇచ్చి హత్య చేయించిన తండ్రి, కొడుకు వేధింపులు భరించలేక అడవిలోకి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య...వీడియో

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif