Telangana: నన్ను జైలుకు పంపే దమ్మున్న మగాడెవడో రండి, ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించిన సీఎం కేసీఆర్, రేపు మ‌ధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ

కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు కేసీఆర్. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం (24-Hour Deadline to Narendra Modi Govt) ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Telangana Chief Minister K Chandrashekar Rao. [File Photo/ANI]

New Delhi, April 11: కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జులు, రైతులు సిద్ధంగా ఉన్నార‌ని, తాడోపేడో తేల్చుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ (CM K Chandrashekar Rao) తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించారు కేసీఆర్. 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై కేంద్రం (24-Hour Deadline to Narendra Modi Govt) ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన రైతు నిర‌స‌న దీక్ష‌లో సీఎం కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. దేశంలోని రైతులు భిక్ష‌గాళ్లు కాదు.. ఒకే విధానం లేక‌పోతే రైతులు రోడ్ల‌పైకి వ‌స్తార‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మోదీ, పీయూష్ గోయ‌ల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాల‌ని (Procure Paddy from Telangana) కోరుతున్నాన‌ని కేసీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్ర బీజేపీ నేత‌ల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ముఖ్య‌మంత్రిని జైలుకు పంపుతామ‌ని అంటున్నారు.. ద‌మ్ముంటే రండి అని కేసీఆర్ స‌వాల్ విసిరారు. కేంద్రం కార్పొరేట్ల‌కు కొమ్ము కాస్తూ.. రైతుల జీవితాల‌తో ఆట‌లాడుకుంటోంద‌ని కేసీఆర్ మండిప‌డ్డారు. కేంద్రానికి ఎదురు తిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థ‌ల‌తో దాడులు చేస్తారు. బీజేపీలో అంద‌రూ స‌త్య‌హ‌రిశ్చంద్రులే ఉన్నారా? వాళ్ల ద‌గ్గ‌ర‌కు ఈడీ, సీబీఐ వెళ్ల‌దు.. ప్ర‌తి రాష్ట్రంలో ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను బెదిరిస్తున్నారు. సీఎంను జైలుకు పంపుతామ‌ని రాష్ట్ర బీజేపీ నేత‌లు అంటున్నారు. ద‌మ్ముంటే రావాల‌ని స‌వాల్ విసిరారు. ఊరికే మొర‌గ‌డం స‌రికాద‌ని కేసీఆర్ అన్నారు.

పీయూష్ గోయ‌ల్ కాదు.. పీయూష్ గోల్ మాల్, మోదీని త‌రిమికొడుతామని సీఎం కేసీఆర్ హెచ్చరిక, ఇంటిగ్రేటెడ్ అగ్రిక‌ల్చ‌ర్ పాల‌సీ రూపొందించాలని కేంద్రానికి డిమాండ్

కేంద్రం పంట మార్పిడి చేయాల‌ని సూచించిన‌ట్లు తాము రైతుల‌కు చెప్పామ‌ని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఉద్దేశ‌పూర్వ‌కంగా రైతులు ధాన్యం పండించండి.. మేము కొంటామ‌ని కిష‌న్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా రైతుల‌ను రెచ్చ‌గొట్టాడు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాల‌ని తాము ఢిల్లీలో ధ‌ర్నా చేస్తే.. పోటీగా బీజేపీ నేత‌లు హైద‌రాబాద్‌లో ధ‌ర్నా చేస్తున్నారు. అస‌లు వాళ్ల‌కు సిగ్గుండాల‌ని కేసీఆర్ విమ‌ర్శించారు. ఏ ఉద్దేశంతో బీజేపీ నేతలు హైద‌రాబాద్‌లో ధ‌ర్నా చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. బీజేపీ నిస్సిగ్గుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. అంతిమ విజ‌యం సాధించేంత వ‌ర‌కు విశ్ర‌మించేది లేద‌ని కేసీఆర్ తేల్చిచెప్పారు.

ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్ష, రైతుల ప‌క్షాన కేసీఆర్ చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తామని తెలిపిన రాకేశ్ తికాయ‌త్, దీక్ష వేదిక‌గా టీఆర్ఎస్ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగిసింది. ది రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ సోమ‌వారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌కు బ‌య‌ల్దేరారు. ఈ నెల 12వ తేదీన మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు తెలంగాణ మంత్రివ‌ర్గం స‌మావేశం కానుంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. కేబినెట్ స‌మావేశానికి మంత్రులంద‌రూ హాజ‌రు కానున్నారు. కేబినెట్ స‌మావేశంలో తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.



సంబంధిత వార్తలు

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

Formula E Race Case: ఫార్ములా-ఈ కార్‌ రేసు కేసు, దమ్ముంటే ప్రభుత్వం అరెస్ట్ చేసుకోవచ్చని కేటీఆర్ సవాల్, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిద్ధమవుతామని ప్రకటించిన బీఆర్ఎస్

Telangana Assembly Session 2024: అప్పులపై చర్చకు మేం సిద్ధం.. బీఆర్ఎస్ సిద్ధమా, సవాల్ విసిరిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సవాల్‌ను స్వీకరిస్తున్నామని తెలిపిన హరీష్ రావు, వీడియోలు ఇవిగో..

CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు