TRS Dharna in Delhi (Photo-ANI)

Hyd, April 11: ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ దీక్ష (TRS Dharna in Delhi) చేప‌ట్టింది. రైతుల ప‌క్షాన ప్ర‌జాప్ర‌తినిధుల నిర‌స‌న దీక్ష పేరుతో ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన దీక్ష‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ ( CM KCR), రాకేశ్ తికాయ‌త్ హాజ‌ర‌య్యారు. స‌భా వేదిక వ‌ద్ద ఏర్పాటు చేసిన అమ‌ర‌వీరుల స్థూపానికి, మ‌హాత్మా జ్యోతిబా ఫూలే, అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టాల‌కు కేసీఆర్ నివాళుల‌ర్పించారు. తెలంగాణ త‌ల్లి విగ్ర‌హానికి కేసీఆర్ పుష్పాలు స‌మ‌ర్పించారు.

కేంద్రం యాసంగి ధాన్యం కొనాల‌నే డిమాండ్‌తో టీఆర్ఎస్ పార్టీ ఈ దీక్ష చేప‌ట్టింది. ధాన్యం సేక‌ర‌ణ‌లో ఒకే విధానం ఉండాల‌నే డిమాండ్‌తో ఈ దీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష‌లో మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో పాటు నాయ‌కులు పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్ల‌పై కేంద్రానికి (Centre's paddy procurement policy) టీఆర్ఎస్ అల్టిమేటం ఇవ్వ‌నుంది. దీక్ష వేదిక‌గా టీఆర్ఎస్ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. కేంద్రంపై పోరును మ‌రింత తీవ్రం చేసే యోచ‌న‌లో సీఎం కేసీఆర్ ఉన్నారు.

మరోసారి పెరిగిన బస్సు ఛార్జీలు, డీజిల్ సెస్ పేరుతో ధరలు పెంచిన టీఎస్‌ఆర్టీసీ, ఆర్డినరీ బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.2 వసూలు, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.5 పెరిగిన ధరలు

ఈ దీక్ష‌లో స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. న‌లుపు రంగు వ‌స్త్రాలు ధ‌రించిన సండ్ర వెంక‌ట‌వీర‌య్య‌, వ‌రి కంకుల‌తో స‌భాస్థలికి చేరుకున్నారు. ఆకుప‌చ్చ రంగు త‌ల‌పాగ ధ‌రించి రైతుల‌కు సంఘీభావం ప్ర‌క‌టించారు. కావ‌డికి ముందు మోదీ ఫోటోను, వెనుకాల వ‌రికంకుల‌ను ఉంచి నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇక ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు న‌లుపు రంగు వ‌స్త్రాలు ధ‌రించి దీక్ష‌కు హాజ‌ర‌య్యారు.

Here's Updates

రైతు వ్య‌తిరేక నిర్ణ‌యాలు తీసుకుంటున్న కేంద్ర ప్ర‌భుత్వంపై జాతీయ రైతు ఉద్య‌మ నాయ‌కుడు రాకేశ్ తికాయ‌త్ తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష‌లో రాకేశ్ తికాయ‌త్ పాల్గొని ప్ర‌సంగించారు. దేశంలో ఏం జ‌రుగుతోందని తికాయ‌త్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు రైతులు మ‌ర‌ణిస్తూనే ఉండాలా? అని ప్ర‌శ్నించారు. దేశంలో రైతులు త‌మ హ‌క్కుల కోసం పోరాడుతూనే ఉంటారు. ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్ర‌భుత్వం ధ‌ర్నా చేస్తోంది. ఒక రాష్ట్ర ప్ర‌భుత్వం ఢిల్లీలో పోరాడ‌డం కేంద్రానికి సిగ్గుచేటు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. ఒకే విధానం లేక‌పోతే రైతులు రోడ్ల‌పైకి రావాల్సి వ‌స్తుంది. సాగుచ‌ట్టాల ర‌ద్దు కోసం ఢిల్లీలో 13 నెల‌ల పాటు ఉద్య‌మించాం. కేంద్రం ఏడాదికి 3 విడ‌తలుగా రైతుల‌కు రూ. 6 వేలు ఇస్తోంది. ఏడాదికి రూ. 6 వేలు ఇస్తూ రైతుల‌ను ఉద్ధ‌రిస్తున్న‌ట్లు కేంద్రం మాట్లాడుతోంది అని ఎద్దెవా చేశారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రైతుల‌కు మ‌ద్ద‌తుగా ఈ ఆందోళ‌న చేస్తున్నారు. కేసీఆర్ చేస్తున్న‌ది రాజ‌కీయ ఉద్య‌మం కాదు అని తికాయ‌త్ ( Rakesh Tikait) స్ప‌ష్టం చేశారు. రైతుల కోసం మ‌మ‌తా బెన‌ర్జీ కూడా ఆందోళ‌న చేస్తున్నారు. రైతుల ప‌క్షాన కేసీఆర్ చేస్తున్న ఈ ఉద్య‌మానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టిస్తున్నాను. రైతుల కోసం పోరాటం ఎవ‌రు చేసినా వారికి మ‌ద్ధ‌తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ది అన్న‌దాత‌ల ప్ర‌భుత్వం అని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ధాన్యం సేక‌ర‌ణ‌పై ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ వేదిక‌గా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిర‌స‌నదీక్ష‌లో మంత్రి నిరంజ‌న్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. ఢిల్లీలో దీక్ష చేయ‌డం మ‌న‌కు సంతోషం కాదు. కానీ ఇలాంటి అనివార్య ప‌రిస్థితులు క‌ల్పించింది కేంద్రం అని మంత్రి మండిప‌డ్డారు. కేంద్ర మోస‌పూరిత వైఖ‌రిని గ్ర‌హించిన సీఎం కేసీఆర్ రైతుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తం చేశారు. వానాకాలం పంట‌ను కొనే స‌మ‌యంలోనే యాసంగి పంట‌ను కొన‌మ‌ని బీజేపీ చెప్పింది. సీఎం కేసీఆర్, మంత్రుల బృందం అనేక‌సార్లు కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద‌కు వ‌చ్చి విజ్ఞ‌ప్తులు చేసిన‌ప్ప‌టికీ కేంద్రం ప‌ట్టించుకోలేదు. ధాన్యం సేక‌ర‌ణ‌పై ప్ర‌ధానికి సీఎం కేసీఆర్ లేఖ రాసినా ఉలుకు ప‌లుకు లేదు. ర‌క‌ర‌కాల ష‌ర‌తులు విధించిన కేంద్రం.. రైతుల ఉసురు పోసుకుంటున్న‌ది.

తెలంగాణ రైతుల‌ను అవ‌మానించేలా కేంద్ర మంత్రి మాట్లాడిండు. క‌నీస మ‌ర్యాద లేకుండా మాట్లాడ‌టం అత్యంత దుర్మార్గం. తెలంగాణ స‌మాజం కేంద్ర ప్ర‌భుత్వాన్ని క్ష‌మించ‌దు. తెలంగాణ రైతులు చెమ‌టోడ్చి పంజాబ్ కంటే అధికంగా ధాన్యం పండించారు. కేసీఆర్ వ‌ల్లే తెలంగాణ రైతులు భారీ స్థాయిలో ధాన్యం పండించి, దేశంలోనే అగ్ర‌స్థానంలో నిలిచారు. రైతుల ప్ర‌యోజ‌నాల విష‌యంలో కేంద్రం పాత్ర లేదు. కేంద్రానికి రైతులు చెమ‌ట‌లు ప‌ట్టించే రోజులు వ‌చ్చాయ‌న్నారు. న‌ల్ల చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు కేంద్రానికి చుక్క‌లు చూపించారు. అబ‌ద్ధాల‌తో బీజేపీ ప‌రిపాల‌న కొన‌సాగిస్తోంది అని మంత్రి నిరంజ‌న్ రెడ్డి ఆగ్ర‌హం వెలిబుచ్చారు.