CM YS Jagan Meets PM Modi: ప్రధానితో ముగిసిన ఏపీ సీఎం సమావేశం, 17 అంశాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు తెలిపిన అధికార వర్గాలు, అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొననున్న ఏపీ సీఎం

దాదాపు 40 నిమిషాల పాటు(The meeting lasted for about 40 minutes) ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

CM YS Jagan Meets PM Modi (Photo-PTI)

New Delhi, Oct 6: రాష్ట్ర అభివృద్ధి ఎజెండాలో (state development agenda) భాగంగా న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం (CM YS Jagan Meets PM Modi) ముగిసింది. దాదాపు 40 నిమిషాల పాటు(The meeting lasted for about 40 minutes) ఈ భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ప్రధాని మోదీతో భేటీ అనంతరం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి జల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర జల శక్తి శాఖ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

Here's YSRCP Party Tweet

సీఎం జగన్‌ వెంట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి, లోక్‌సభలో పార్టీ విప్‌ మార్గాని భరత్, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు ఉన్నారు.