AP CM Jagan: ప్రకాశం, విజయవాడ, విశాఖలో సీఎం జగన్ రెండ్రోజుల పర్యటన.. నేడు వైసీపీ నేత అశోక్ బాబు తల్లికి నివాళి.. సాయంత్రం గవర్నర్ తో భేటీ.. రేపు విశాఖలో జీ20 ప్రతినిధులతో సమావేశం

ఇవాళ, రేపు ప్రకాశం, విజయవాడ, విశాఖలో పర్యటించనున్నారు.

CM YS Jagan (Photo-AP CMO Twitter)

Vijayawada, March 27: ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) రెండ్రోజుల పర్యటనకు సంబంధించి షెడ్యూల్ (Schedule) ఖరారైంది. ఇవాళ, రేపు ప్రకాశం (Prakasham), విజయవాడ (Vijayawada), విశాఖలో (Vishakhapatnam) పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి గ్రామానికి చేరుకుంటారు. 11.15 గంటలకు కొండెపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు నివాసంలో ఆయన తల్లి కోటమ్మ భౌతిక కాయానికి నివాళులర్పిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌తో సీఎం జగన్‌ మర్యాదపూర్వకంగా సమావేశం అవుతారు.

Tirumala Special Darshan Tickets: ఏప్రిల్ నెల శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు నేడు విడుదల.. ఈ ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో.. ఆన్ లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలన్న టీటీడీ.. తిరుమలలో 30న శ్రీరామనవమి ఆస్థానం... 31న శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం.. నేడు తిరుమల చేరుకోనున్న 10 ధర్మరథం విద్యుత్ బస్సులు

28న జీ-20 ప్రతినిధులతో ఇంటరాక్షన్‌

28వ తేదీ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి సీఎం వైఎస్‌ జగన్‌ బయలుదేరి 5.15 గంటలకు విశాఖ చేరుకుంటారు. సాయంత్రం 6 గంటలకు రిషికొండ రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌కు చేరుకుని రాత్రి 7-8 గంటల మధ్య జీ-20 ప్రతినిధులతో జరిగే ఇంటరాక్షన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అతిథులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'గాలా డిన్నర్‌'లో పాల్గొని రాత్రి 8.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 10 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.

WPL Final 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ముంబై కైవసం, దుమ్మురేపిన హర్మన్‌ ప్రీత్, ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి చాంపియన్స్‌గా అవతరించిన ముంబై ఇండియన్స్



సంబంధిత వార్తలు

CM Chandrababu Polavaram Visit Updates: పోలవరం, అమరావతి రాష్ట్రానికి రెండు కళ్లు, 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని తెలిపిన సీఎం చంద్రబాబు

Telangana Congress: కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం తగదు...ఇదే కొనసాగితే ప్రజలు బుద్దిచెప్పడం ఖాయమని వెల్లడి

CM Revanth Reddy: 98 శాతం కులగణన పూర్తి, తెలంగాణకు బహుజనుల తల్లి కావాలి...దొడ్డి కొమురయ్య పేరు శాశ్వతంగా గుర్తుండిపోయేలా చర్యలు తీసుకుంటామన్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, పేదవారిపై నిర్లక్ష్యం తగదు...ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటన