Corona in AP: ఏపీలో కరోనా కట్టడి చర్యలు భేష్, ప్రభుత్వ చర్యల వల్ల కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపిన ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా, తాజాగా 1,535 మందికి కోవిడ్, కరోనా మృతుల పిల్లలకు ఏపీ సర్కార్‌ అండ

కొత్తగా 1,535 కరోనా కేసులు (Coronavirus in Andhra Pradesh) నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావంతో 16 మంది మృతి చెందారు. తాజాగా 2,075 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

COVID Outbreak- Representational Image (Photo Credits: IANS)

Amaravati, August 14: ఏపీలో గడిచిన 24 గంటల్లో 69,088 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,535 కరోనా కేసులు (Coronavirus in Andhra Pradesh) నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రభావంతో 16 మంది మృతి చెందారు. తాజాగా 2,075 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇక రాష్ర్టంలో ఇప్పటి వరకు 2,55,95,949 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 19,60,350 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి బారినపడి మొత్తం 13,631 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,210 పాజిటివ్‌ కేసులు (Active Cases) ఉన్నాయి. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 19,92,191 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

ఏపీలో కరోనా కట్టడి చర్యలు బాగున్నాయని ఢిల్లీ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా (Delhi AIIMS Director Randeep Guleria) అన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల ఏపీలో కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎస్‌వోపీ పాటించడంపైనే థర్డ్‌వేవ్‌ ఆధారపడి ఉంటుంది. పిల్లలపై థర్డ్‌వేవ్‌ ప్రభావం చూపుతుందనడానికి ఆధారాలు లేవు. ఇప్పటికే చాలామంది పిల్లలు వైరస్‌ బారినపడి రికవరీ అయ్యారు. కోవిడ్‌ను ఎదుర్కోవడానికి మాస్క్‌, టీకా తప్ప మరో మార్గం లేదు’’ అని అన్నారు.

పిల్లలను టార్గెట్ చేసిన కరోనా థర్డ్ వేవ్, బెంగుళూరులో 543 మంది పిల్లలకు కోవిడ్, ఆగస్టు 15వతేదీ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ఆర్ అశోకా

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఆ విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రైవేటు స్కూల్‌లో.. ఎందులో చదువుతున్నా సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటోంది. 2020, 2021ల్లో కరోనాతో 6,800 మంది పిల్లలు తమ తల్లి లేదా తండ్రిని లేదా ఇద్దరినీ కోల్పోయారని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. ఇలా ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే చైల్డ్‌ ఇన్ఫో డేటా ప్రకారం గుర్తించాలని అన్ని విద్యా సంస్థలకు పాఠశాల విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా వల్ల అనాథలైన బాలబాలికలు ఏ పాఠశాలలో చదువుతున్నా అక్కడే వారు కొనసాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

ప్రైవేటు పాఠశాలల్లో వారికి ఇబ్బందులు ఎదురైతే ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం కింద వారికి అక్కడే చదువు చెప్పించనుంది. అలాగే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఎవరైనా బడి మానేసి ఉంటే.. వారిని కూడా గుర్తించి ఉచిత విద్య అందించనుంది. తల్లిదండ్రులను కోల్పోయిన 6,800 మంది పిల్లల్లో ఇప్పటివరకు 4,333 మంది పిల్లల పూర్తి వివరాలను అధికారులు సేకరించారు.

దేశంలో పెరుగుతున్న డెల్టా వేరియంట్‌ కేసులు, తాజాగా 38,667 కరోనా కేసులు నమోదు, కేరళలో కొనసాగుతున్న కరోనా విజృంభణ, భారత్‌లో 3,21,56,493కు చేరుకున్నమొత్తం కేసుల సంఖ్య

ఈ పిల్లల్లో 1,659 మంది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో, 2,150 మంది ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్నట్లుగా నిర్ధారించారు. మరో 524 మంది శిశువులుగా ఉన్నారని తేల్చారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో విద్యాసంస్థల పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ విద్యాసంస్థలకు రానున్న కాలంలో తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.

కరోనాతో చనిపోయిన జర్న లిస్టుల కుటుంబాలకు శాశ్వత మేలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్‌ చెప్పారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టులు చాలా మంది కరోనాతో చనిపోయారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండోదశ వైరస్‌ విజృంభణలో ఎక్కువమంది జర్న లిస్టులు మృతిచెందారని తెలిపారు. వీరి కుటుం బాలకు శాశ్వత మేలు కల్పించడానికి ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు తెలిపారు.