Coronavirus in US (Photo Credits: PTI)

New Delhi, August 14: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 38,667 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,21,56,493కు (Coronavirus in India) చేరింది. ఇందులో 3,13,38,088 మంది బాధితులు కోలుకోగా, 3,87,673 కేసులు (Coronavirus Active in India) యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,30,732 మృతిచెందారు.

శుక్రవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 478 మంది మరణించగా, మరో 35,743 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉందని తెలిపింది. దేశవ్యాప్తంగా 53.61 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ (Coronavirus Vaccination) డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది. కాగా, శుక్రవారం 40 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీనితోపోల్చితే కొత్తగా రికార్డయిన కేసులు 3.6 శాతం తక్కువ.

దేశంలో కరొనా డెల్టా వేరియంట్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు డెల్టా వేరియంట్‌ కేసుల సంఖ్య 66కు చేరింది. శుక్రవారం థానేలో కొత్తగా మరో కేసు నమోదయిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ కరోనా కొత్త రకం వల్ల మహారాష్ట్రలో ఐదుగురు మరణించారని వెల్లడించింది. మృతుల్లో రత్నగిరికి చెందినవారు ఇద్దరు ఉండగా, ముంబై, బీడ్‌, రాయ్‌గడ్‌కు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారని తెలిపింది.

మరో కీలక అడుగు..ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్, రెండు, మూడో ద‌శ క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్‌కు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్న‌ల్, యూఎస్‌లోని వాషింగ్ట‌న్ యూనివ‌ర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్న భార‌త్ బ‌యోటెక్

ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికే రాష్ట్రంలో ప్రవేశానికి అనుమతించాలని నిర్ణయించింది. రాష్ట్రానికి వచ్చేవారు తమతో పాటు వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంచుకోవాలని అధికారులు తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకోని వారు రాష్ట్రంలోకి రావాలంటే నెగిటివ్ ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్ సంబంధిత అధికారులకు చూపించాలని స్పష్టం చేశారు. ఈ నియమాలు పాటించని వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించనున్నారు.

కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. పక్షం రోజులుగా 20 వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ ‌కేసులు 1.8 లక్షలకు పెరిగాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. కాగా, గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 20,452 కరోనా కేసులు, 114 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,52,090కు, మొత్తం మరణాల సంఖ్య 18,394కు పెరిగింది.

మరో ప్రాణాంతక వైరస్ వెలుగులోకి, గినియా దేశంలో మార్బర్గ్ వైరస్ కేసును గుర్తించినట్లు తెలిపిన డబ్ల్యూహెచ్ఓ, మార్‌బర్గ్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయో ఓ సారి తెలుసుకోండి

మరోవైపు గత 24 గంటల్లో 16,856 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 34,53,174కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,80,000 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.