COVID in AP: రాజమండ్రిలో తొలి కరోనా కేసు, ఏలూరులో మరో కేసు నమోదు, కొత్త వేరియంట్ నేపథ్యంలో జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు శాంపిల్స్

85 ఏళ్ల మహిళకు కోవిడ్ సోకినట్టు సమాచారం. శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్‌కు అధికారులు పంపించారు.అలాగే ఏలూరులో కరోనా మరో కేసు నమోదైంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఆరుగురికి ర్యాoడమ్ టెస్టులు చేసిన వైద్యులు.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు.

Representational image (Photo Credit- Pixabay)

ఏపీలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కోవిడ్‌ కేసు నమోదైంది. 85 ఏళ్ల మహిళకు కోవిడ్ సోకినట్టు సమాచారం. శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్‌కు అధికారులు పంపించారు.అలాగే ఏలూరులో కరోనా మరో కేసు నమోదైంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఆరుగురికి ర్యాoడమ్ టెస్టులు చేసిన వైద్యులు.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు.

నిలోఫర్ ఆస్పత్రిలో 14 నెలల చిన్నారికి కరోనా, తెలంగాణలో కొత్తగా ఆరు కేసులు నమోదు, 16 కేసులు హైదరాబాద్‌లోనే..

వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్‌ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు వైద్యులు పంపించారు. పాజిటివ్ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ప్రజలు ఆందోళన పడొద్దని డీఎం అండ్ హెచ్ఓ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు ఎక్కడికి వెళ్లి రాలేదని స్పష్టం చేశారు.