Guntur COVID-19: క్వారంటైన్‌కు గుంటూరు డాక్టర్లు, మెడికో సహా ఇద్దరు ఆర్‌ఎంపీలకు కరోనావైరస్ పాజిటివ్, ఏపీలో 534కు చేరిన కేసుల సంఖ్య
తాజాగా గుంటూరు జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు (Guntur Doctors in Quarantine) తరలించారు.ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురి రిపోర్ట్ వచ్చింది. అందులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
Guntur, April 17: ఏపీలో కరోనావైరస్( Coronavirus) పంజా విప్పుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కొత్తగా మరో 9 కరోనా పాజిటివ్ కేసులు (Coronavirus Cases) నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 534కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్ అధికారి హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఇదిలా ఉంటే అత్యధికంగా గుంటూరులో 122 కేసులు నమోదయ్యాయి. తాజాగా గుంటూరు జిల్లాలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్లను ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్‌కు (Guntur Doctors in Quarantine) తరలించారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా
ప్రభుత్వ జ్వరాల ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న 54 మంది డాక్టర్లు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో నలుగురి రిపోర్ట్ వచ్చింది. అందులో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మరో 50 మందికి సంబంధించి కరోనావైరస్ పరీక్షల రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు ముందు జాగ్రత్తగా గుంటూరు నగరంలోని ఓ ప్రైవేటు లాడ్జీని క్వారంటైన్ కేంద్రంగా మార్చి డాక్టర్లను, వైద్య సిబ్బందిని అక్కడికి తరలించారు.
ఏపీ సర్కారు కీలక నిర్ణయం, క్వారంటైన్ పూర్తి చేసుకున్న బాధితులకు రూ.2 వేలు
జిల్లాలో ఇప్పటివరకు ఒక మెడికో సహా ఇద్దరు ఆర్‌ఎంపీలకు కరోనా సోకినట్టుగా అధికారులు చెప్పారు. దీంతో ఇద్దరు ఆర్‌ఎంపీల వద్ద వైద్యం చేయించుకున్న దాదాపు 190 మంది క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. మరోవైపు గుంటూరు జిల్లాలో 122 కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో జిల్లా వ్యాప్తంగా కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది.