Amaravati, April 16: ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు (Coronavirus Outbreak) పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సర్కారు నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష (AP CM Jagan Review on COVID-19) నిర్వహించారు. ఈసమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకట రమణ, కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా పంజా
క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలపై సీఎం ఆరా తీశారు. ఇప్పటికే కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకుంటున్న జగన్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందులో భాగంగా క్వారంటైన్ (Quarantine) పూర్తి చేసుకున్నవారికి రూ.2వేలు ఆర్థికసాయం అందించనుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక పౌష్టికాహారం తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వం ఈ ఆర్థికసాయం ఇవ్వనుంది. అలాగే రానుపోను చార్జీల కోసం మరో రూ.600 ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
ఇంగ్లీష్ మీడియం జీవోను కొట్టివేసిన హైకోర్టు
ఇంటికి వెళ్లిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించాలని, ప్రతి వారం వచ్చి పరీక్షలు చేయించుకునేలా చూడాలన్నారు. కరోనాపై విజయం సాధించాలంటే రోగ నిరోధక శక్తి చాలా అవసరం. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. అందుకే తామీ పని చేశామని ప్రభుత్వం చెబుతోంది.
నూతన ఎన్నికల కమిషనర్‌గా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్
కడపలో 13మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న 13మందిని ఫాతిమా మెడికల్ కాలేజీ ఆసుపత్రి నుంచి గురువారం(ఏప్రిల్ 16,2020) డిశ్చార్జ్ అయ్యారు. 13మందికి నెగెటివ్ రావడంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ అయిన వారిని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పరామర్శించారు. వారందరికి ప్రభుత్వం తరపున రూ.2వేలు చొప్పున అందజేశారు.
ఏపీ డీజీపీకి విజయసాయి రెడ్డి లేఖ
కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన సుమారు 32 వేల మందికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్‌మోహన్ రెడ్డి అధి కారులను ఆదేశించారు. ఈ పరీక్షలు పూర్తయిన తరువాత ర్యాండమ్‌గా పరీ క్షలు చేయాలని, మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ర్యాండమ్ పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. క్వారంటైన్ సెంటర్లలో సదుపాయాలపై సీఎం మరోసారి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇకపై అనుమానిత రోగుల్ని ఇకపై ఐసొలేషన్ వార్డులకు తీసుకెళ్లరు. ఇంట్లోనే పరీక్షలు నిర్వహిస్తారు. టెస్టుల్ని కూడా ఉచితంగా నిర్వహిస్తారు. పాజిటివ్ అని తేలిన తర్వాత మాత్రమే ఐసొలేషన్ వార్డులకు తరలిస్తారు. అయితే టెస్టులు పూర్తయి, ఫలితాలు వచ్చేంత వరకు మాత్రం అనుమానితులంతా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలి. తీవ్రమైన జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడే వారు ఎవరైనా ఈ సేవలు పొందవచ్చని.. ఒకవేళ కరోనా కాదని నిర్థారణ అయితే.. సాధారణ మందులు కూడా అక్కడికక్కడే వైద్యులు అందిస్తారని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మరింత మంది వైద్య సిబ్బందిని తీసుకునేందుకు 2 రోజుల కిందట నోటిఫికేషన్ కూడా జారీ చేసింది.