AP Coronavirus: మరో రికార్డు దిశగా ఏపీ, ఆరు లక్షల మార్కుకు చేరువలో కరోనా టెస్టులు, ఏపీలో తాజాగా 299 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు
ఈ కేసులను కలుపుకుని రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 5854 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 13,923 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 299 మందికి పాజిటివ్‌గా (Coronavirus Outbreak) నిర్దారణ అయింది. గడిచిన 24 గంటల్లో కరోనా ( COVID-19) నుంచి కోలుకుని 77 మంది డిశ్చార్జ్ కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 92కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,983 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,779 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
Amaravati, june 18: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 299 కరోనా పాజిటివ్ కేసులు (AP Coronavirus) నమోదయినట్లు వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈ కేసులను కలుపుకుని రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటివరకు 5854 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 13,923 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 299 మందికి పాజిటివ్‌గా (Coronavirus Outbreak) నిర్దారణ అయింది. వారి అకౌంట్లోకి నేరుగా రూ.24,000, వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా చేనేత కార్మికులకు ఆర్థిక సాయం, ఈ నెల 20న అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం
గడిచిన 24 గంటల్లో కరోనా ( COVID-19) నుంచి కోలుకుని 77 మంది డిశ్చార్జ్ కాగా ఇద్దరు మృత్యువాత పడ్డారు. దీంతో ఏపీలో కరోనా మరణాల సంఖ్య 92కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,983 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 2,779 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే కరోనావైరస్ నిర్ధారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డుకు దగ్గరలో ఉంది. ఆరు లక్షల మార్కుకు కేవలం అడుగు దూరంలో నిలిచింది. మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 15,188 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడం ద్వారా ఇప్పటివరకు నిర్వహించిన పరీక్షల సంఖ్య 5,98,474కి చేరింది. ఈ నెల 11న 5 లక్షల మార్కు చేరిన వారంలోనే మరో లక్ష పరీక్షలు నిర్వహించడం గమనార్హం. దీంతో రాష్ట్రంలో ప్రతి పది లక్షల మంది జనాభాకి 11,207 మందికి పరీక్షలు నిర్వహించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలుస్తోంది. వేదాద్రి మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం రూ.5లక్షల పరిహారం, తెలంగాణ వారికీ ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని అధికారులకు ఆదేశాలు
కొత్తగా 351 మందికి కరోనా సోకడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,071కి చేరింది. ఇందులో 5,555 కేసులు మన రాష్ట్రానికి చెందినవి కాగా, 1,253 ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, 263 విదేశాల నుంచి వచ్చిన వారివి ఉన్నాయి. 128 మంది డిశ్చార్జి కావడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,641కు చేరింది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 90కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,340గా ఉంది.
కోవిడ్–19 నియంత్రణ చర్యల కోసం రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ రూ.77.44 కోట్లను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం కోవిడ్–19ను జీవసంబంధమైన విపత్తుగా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి రూ.77.44 కోట్లను ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు విడుదల చేసింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి బుధవారం జీవో జారీ చేశారు.