Vedadri Road Accident: వేదాద్రి మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం రూ.5లక్షల పరిహారం, తెలంగాణ వారికీ ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని అధికారులకు ఆదేశాలు

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Vedadri Road Accident) చనిపోయిన వారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికీ కూడా ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Vedadri Road Accident: వేదాద్రి మృతుల కుటుంబాలకు ఏపీ సీఎం రూ.5లక్షల పరిహారం, తెలంగాణ వారికీ ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని అధికారులకు ఆదేశాలు
Vedadri Road Accident (Photo-Twitter)

Amaravati, June 18: కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Vedadri Road Accident) చనిపోయిన వారికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ ‌జగన్‌మోహన్‌రెడ్డి (AP CM YS Jagan) ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికీ కూడా ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. 12 మందిని బలిగొన్న లారీ డ్రైవర్ మద్యం మత్తు, వేదాద్రి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల నష్టపరిహారం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్

ఈ ప్రమాం రాష్ట్ర భూభాగంలోనే జరిగినందున మానవతా దృక్పథంతో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు 2లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి వద్ద బుధవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన 9 మంది మృతి చెందారు.

వేదాద్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

(The above story first appeared on LatestLY on Jun 18, 2020 01:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).