Vedadri Road Accident: 12 మందిని బలిగొన్న లారీ డ్రైవర్ మద్యం మత్తు, వేదాద్రి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల నష్టపరిహారం ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్
Vedadri Road Accident (Photo-Twitter)

Hyderabad, June 18: ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Vedadri Road Accident) చనిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రటించింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ( TS CM KCR) వెల్లడించారు. ఈ మేరకు గురువారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి పువ్వాడకు సూచించారు. ఎపీకి చెందిన ముగ్గురితో పాటు మొత్తం 12 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశించారు. కాగా, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని వేదాద్రి వద్ద బుధవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు, ఖమ్మం జిల్లా మధిరకు చెందిన 9 మంది మృతి చెందారు.

మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో తొమ్మిది మంది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్దగోపవరం, జమలాపురం గ్రామాలకు చెందినవారు కాగా, మరో ముగ్గురు కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జయంతి గ్రామానికి చెందినవారు ఉన్నారు.లారీ డ్రైవర్‌ (Lorry Driver) మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

వేదాద్రి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.