Curfew in Andhra Pradesh: తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు బంద్, వస్తే మధ్యాహ్నం 12 గంటల్లోపే గమ్యం చేరాలి, నేటి నుంచి ఏపీలో 18 గంట‌ల కర్ఫ్యూ అమల్లోకి, కర్ప్యూ నుంచి మినహాయింపు పొందేవి ఏవో ఓ సారి తెలుసుకోండి

నేటి నుంచి రాష్ట్రంలో ప్ర‌తిరోజూ 18 గంట‌ల చొప్పున క‌ర్ఫ్యూ (18-hour curfew from today in Anadhra Pradesh) అమ‌లు కానుంది. ప్ర‌తిరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ (Day Time Curfew) అమ‌ల్లో ఉంటుంది.

Coronavirus Lockdown. Representative Image (Photo Credit: PTI)

Amaravati, May 5: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్ర‌భుత్వం నివార‌ణా చ‌ర్య‌లు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్ప‌టికే సాయంత్రం క‌ర్ఫ్యూ అమ‌లు చేస్తుండ‌గా, నేటి నుంచి ప‌గ‌టిపూట క‌ర్ఫ్యూ (Curfew in Andhra Pradesh) కూడా అమ‌ల‌ు చేస్తోంది. నేటి నుంచి రాష్ట్రంలో ప్ర‌తిరోజూ 18 గంట‌ల చొప్పున క‌ర్ఫ్యూ (18-hour curfew from today in Anadhra Pradesh) అమ‌లు కానుంది. ప్ర‌తిరోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుంచి మ‌రుస‌టి రోజు ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ (Day Time Curfew) అమ‌ల్లో ఉంటుంది.

అదేవిధంగా ఉద‌యం 6 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు 144వ సెక్ష‌న్ అమ‌లు చేస్తున్నారు. ఈ ఆంక్ష‌లు రెండు వారాలపాటు అమ‌ల్లో ఉంటాయి. ప్ర‌భుత్వం మిన‌హాయింపునిచ్చిన అత్య‌వ‌స‌ర విభాగాలు, సేవ‌ల రంగాల్లో ప‌నిచేస్తున్న‌వారు త‌ప్ప మిగ‌తా వ్య‌క్తులెవ‌రు క‌ర్ఫ్యూ స‌మ‌యంలో బ‌య‌ట తిర‌గ‌డానికి వీళ్లేద‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది.

మధ్యాహ్నం 12 తర్వాత అన్ని సంస్థలు, షాపులు, కార్యాలయాలు, విద్యా సంస్థ లు, హోటళ్లు మూసివేయబడతాయి. ఆర్టీసీ బస్సులతో పాటు ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాలూ రోడ్డెక్కడానికి వీల్లేదు. ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కూడా మూసివేస్తారు. ప్రయాణికులు ఉన్న ప్రైవేటు బస్సులు, కార్లు అనుమతించరు. అంబులెన్స్‌లు, ఎమర్జెన్సీ వాహనాలకు మినహాయింపు ఉంటుంది. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఈ జీవో (జీ-192) జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు, ఒక్కరోజులోనే 82 మంది మృతి, బుధవారం నుంచి మధ్యాహ్నం కర్ఫ్యూ అమలు, మద్యం అమ్మకాల వేళలు కుదింపు

పీలో 18 గంట‌ల క‌ర్ఫ్యూ అమ‌ల్లోకి రావ‌డంతో మ‌ధ్యాహ్నం 12 గంట‌ల త‌ర్వాత ప్ర‌భుత్వ‌, ప్రైవేటు ప్ర‌జా ర‌వాణా వాహ‌నాల‌ను నిలిపివేయ‌డంతో..ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ మ‌ధ్య తిరిగే సుమారు 2500 వ‌ర‌కు బ‌స్సుల‌కు బ్రేకులు ప‌డ్డాయి. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు క‌లిసి రోజూ 1400 నుంచి 1500 బ‌స్సుల వ‌ర‌కు న‌డుపుతున్నాయి. మ‌రో తొమ్మిది వంద‌ల వ‌ర‌కు ప్రైవేటు బ‌స్సులు తిరుగుతున్నాయి. క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో ఇవ‌న్నీ డిపోల‌కు, షెడ్ల‌కు పరిమితం కానున్నాయి. కాగా అంతర్రాష్ట్ర, అంతర్‌ జిల్లాల ప్రజా రవాణాను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తారు.అంటే ఈ లోపే గమ్యం చేరాల్సి ఉంటుంది.

ఇప్పటికే బెంగళూరు, చెన్నైకు బస్సు సర్వీసులు ఆపేశారు. దూర ప్రాంత సర్వీసులు దాదాపు నిలిపేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే 50% సీట్ల సామర్థ్యంతో నడుపుతుండగా.. బుధవారం నుంచి కనీసం 85 శాతం సీట్లలో ప్రయాణికులు నిండితేనే బస్సులు బయలుదేరనున్నాయి. ఓ ప్రాంతానికి వెళ్లే రెండు, మూడు సర్వీసులను కలిపి ఒకే సర్వీసుగా పంపనున్నారు. బస్టాండ్లకు వచ్చే ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు నడుపుతామని అధికారులు తెలిపారు. రాష్ట్ర సచివాలయ, హైకోర్టు ఉద్యోగుల కోసం నడిపే సర్వీసులు అన్నింటినీ మాత్రం కొనసాగిస్తారు

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, సర్పంచ్‌తో సహా నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి, సజ్జాపురం వద్ద అదుపు తప్పి చేపల చెరువులో పడిన ట్రాక్టర్

కర్ఫ్యూ నుంచి పలు సేవలకు ప్రభుత్వం మినహాయింపు నిచ్చింది. ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియాతోపాటు టెలికామ్‌, ఇంటర్‌నెట్‌, బ్రాడ్‌కాస్టింగ్‌, ఐటీ సేవలు, పెట్రోల్‌ బంకులు, ఎల్పీజీ, సీఎన్‌జీ గ్యాస్‌ అవుట్‌లెట్లు, విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా సంస్థలు, నీటి సరఫరా, పారిశుధ్యం, గిడ్డంగులు, సెక్యూరిటీ సేవలకు మినహాయింపు నిచ్చింది.

విమాన, రైల్వే ప్రయాణికులు విధిగా టికెట్లు చూపించాలని ఆదేశించింది. సరిహద్దులో రేపటి నుంచి పబ్లిక్ వాహనాలపైనా ఏపీ సర్కార్‌ ఆంక్షలు విధించింది. అలాగే నిత్యావసరాలు, ఇతర సరుకులు రవాణా చేసే వాహనాలకు మాత్రం అనుమతి ఉంది.. వారికి కర్ఫ్యూ ఆంక్షలు వర్తించవని అధికారులు తెలిపారు. అయితే లోడింగ్, అన్ లోడింగ్ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపే చేయాల్సి ఉంటుంది. వైద్య ఆరోగ్యానికి సంబంధించిన మందులు, ఇతర వస్తువులు ఎప్పుడైనా చేసుకోవచ్చు.

ఈ రంగాలకు మినహాయింపులు

ప్రింట్‌, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు.

టెలీకమ్యూనికేషన్‌, ఇంటర్నెట్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సంస్థలు

పెట్రోలు పంపులు, ఎల్‌పీజీ, సీఎన్‌జీ, గ్యాస్‌ విక్రయ కేంద్రాలు. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలు

నీటి సరఫరా, పారిశుద్ధ్య సేవలు. శీతల, సాధారణ గిడ్డంగుల సంస్థలు, ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు

ఉత్పాదక తయారీ పరిశ్రమలు. (ప్రమాణాల ప్రకారం నడుచుకోవాలి), వ్యవసాయ పనులు, వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుంది.

ఆస్పత్రులు, డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌లు, మెడికల్‌ షాపులు, ఐటీ సేవలు

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, 7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు కేబినెట్‌ ఆమోదం, మధ్యాహ్నం 12 గంటల తర్వాత అన్నీ బంద్, కేబినెట్ ఆమోదం పొందిన పలు నిర్ణయాలు ఇవే..

వీరి రాకపోకలకు ఓకే...

వైద్య, ఆరోగ్య సిబ్బంది, గర్భిణులు, వైద్యం అవసరం ఉన్న ఇతర రోగులు., వ్యాక్సిన్‌ కోసం వెళ్లేవారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కోర్టులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ సంస్థల్లో పనిచేసేవారు డ్యూటీ పాస్‌తో కర్ఫ్యూ సమయంలో తిరగొచ్చు. వైద్య సేవల కోసం వెళ్లే రోగులు, గర్భిణులు, కోవిడ్‌ టీకాలకు వెళ్లే వ్యక్తులు. ఆరోగ్య సేవలు పొందడానికి వెళ్లే వ్యక్తులు ప్రైవేటు రవాణా సేవలు పొందడానికి అనుమతి

20 మందితోనే పెళ్లి వేడుక...

ఇప్పటికే ముహూర్తాలు పెట్టుకుని, వాయిదా వేసుకోలేని పరిస్థితి ఉన్న పెళ్లిళ్లలను 20మందితో మాత్రమే జరుపుకోవాలి. దీనికి కూడా స్థానిక అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి.

కట్టుదిట్టంగా అమలు...

కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాధిపతులు, పోలీసు కమిషనర్లు, కలెక్టర్లు కర్ఫ్యూ నిబంధనల అమలుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. ‘‘ఆంక్షల నుంచి మినహాయింపు ఉన్నవారికోసం పాస్‌లు ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. నిబంధనలను ఉల్లంఘించే వారిపై విపత్తు చట్టం-2005లోని 51-60 సెక్షన్‌లతోపాటు... ఐపీసీలోని సెక్షన్‌ 188, ఇతర చట్టాల కింద చర్యలు తీసుకోవాలి’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.