Nellore Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, సర్పంచ్‌తో సహా నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి, సజ్జాపురం వద్ద అదుపు తప్పి చేపల చెరువులో పడిన ట్రాక్టర్
Road accident (image use for representational)

Nellore, May 5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదం (Nellore Road Accident) జరిగింది. సజ్జాపురం- గొల్లకందుకూరులో సమీపంలోని చేపల గుంటలో ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో కూలీలు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు జిల్లా సజ్జాపురంలో పుచ్చకాయలను కోసేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ అదుపు తప్పి పక్కనే చేపల చెరువులో బోల్తాపడింది.

ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత (Sajjapuram Road Accident) పడ్డారు. మృతులను లక్ష్మీకాంతమ్మ (45), హరిబాబు (43), పెంచలయ్య (60), కృష్ణవేణి (26), వెంకటరమణమ్మ (19)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మెట్రో రైలు వెళుతుండగా కూలిన ఫైఓవర్‌, 20 మంది మృతి, 70 మందికి పైగా గాయాలు, మెక్సికోలో విషాద ఘటన, వైరల్‌ మారిన సీసీ టీవీ దృశ్యాలు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు రూరల్‌ మండలం సజ్జాపురం గ్రామ సర్పంచ్‌ అప్పకూటి పెంచలయ్య గొల్లకందుకూరులో పొలం కౌలుకు తీసుకుని పుచ్చ పంట సాగు చేస్తున్నాడు. పంట కోతకు రావడంతో మంగళవారం ఉదయం తన సొంత ట్రాక్టర్‌లో సజ్జాపురానికి చెందిన 12 మంది కూలీలను తీసుకుని పొలానికి బయలు దేరాడు. గొల్లకందుకూరు సమీపానికి వచ్చేసరికి చేపల చెరువు కట్ట మీదుగా వెళ్తున్న ట్రాక్టర్‌.. అదుపు తప్పి చెరువులో బోల్తా (Andhra Pradesh Road Accident) పడింది.

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, 7వ తరగతి నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌కు కేబినెట్‌ ఆమోదం, మధ్యాహ్నం 12 గంటల తర్వాత అన్నీ బంద్, కేబినెట్ ఆమోదం పొందిన పలు నిర్ణయాలు ఇవే..

ఇంజిన్‌తో పాటు ట్రాలీ నీళ్లల్లోకి పల్టీ కొట్టింది. డ్రైవర్‌తో సహా ట్రాక్టర్‌లోని కొందరు ప్రమాదాన్ని ముందే గుర్తించి.. కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. నీళ్లల్లో ట్రాలీ మీద పడటంతో పాక కృష్ణవేణి(26), కిలారి హైమావతి(43), లాలి లక్ష్మీకాంతమ్మ(45), సర్పంచ్‌ అప్పకూటి పెంచలయ్య (60), తాండ్ర వెంకరమణమ్మ(19) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్‌ సీఐ శ్రీనివాసులురెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని.. ప్రమాద వివరాలు తెలుసుకున్నారు.

ఘోర ప్రమాదం, పద్మా నదిలో తిరగబడిన బోటు, 26 మంది అక్కడికక్కడే దుర్మరణం, కార్గో పడవను ఢీ కొట్టిన బోటు, బంగ్లాదేశ్‌లో విషాద ఘటన

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. అలాగే ప్రమాద విషయం తెలిసిన వెంటనే నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఘటనా స్థలికి చేరుకున్నారు. బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. మృతులందరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో.. సజ్జాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.