బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో అత్యంత వేగంగా వెళుతున్న బోటు తిరగబడిన ఘటనలో 26 మంది మరణించారు. మరో అయిదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం మదారిపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఇసుకను తీసుకెళ్లే కార్గో పడవను ప్రయాణికులతో వెళుతున్న బోటు ఢీ కొట్టడంతో ( Speedboat Collides With Sand Carrier) ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

ప్రమాదం జరిగినప్పుడు అనుభవం లేని ఓ బాలుడు దాన్ని నడుపుతున్నాడని పోలీసులు వెల్లడించారు. బుధవారం వరకూ కోవిడ్‌ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, వాటిని పాటించకుండా ఒకే పడవలో 30 మందిని ఎక్కించారని ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. మొత్తం 26 మృతదేహాలను నీటి నుంచి వెలికి తీశారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)