AP Coronavirus Report: ఒక్కరోజే కరోనాతో 37 మంది మృతి, గత 24 గంటల్లో 1935 కోవిడ్-19 కేసులు, రాష్ట్రంలో మొత్తం 16,464 మంది డిశ్చార్జ్‌

వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 13 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ (AP Corona Updates) అయ్యింది. దీంతో ఈ రోజు మొత్తం 1935 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1030 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 16,464 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

Coronavirus in India (Photo Credits: IANS)

Amaravati, July 13: ఏపీలో కొత్తగా1,919 కరోనా పాజిటివ్‌ కేసులు (AP Coronavirus Report) నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 13 మంది, విదేశాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ (AP Corona Updates) అయ్యింది. దీంతో ఈ రోజు మొత్తం 1935 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 1030 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 16,464 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. మాస్క్ అడిగినందుకు కూతుర్ని చంపేశారు, గుంటూరు జిల్లాలో విషాద ఘటన, నలుగురిపై హత్యా నేరం క్రింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న గుంటూరు పోలీసులు

గత 24 గంటల్లో కరోనా బారిన పడి అనంతపురంలో ఆరుగురు, కర్నూలులో నలుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, చిత్తూరులో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు,కృష్ణాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, కడపలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు.. శ్రీకాకుళం,విశాఖపట్నం,విజయనగరంలో ఒక్కరు చొప్పున మొత్తం 37 మంది మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకి మొత్తం 365 మంది మృతిచెందారు.

Here's AP Corona Report

గత 24 గంటల్లో 19,247 శాంపిల్స్‌ను పరీక్షించగా, ఇప్పటివరకు ఏపీలో 11,73,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య మొత్తం 31,103కు చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం 14,274 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ఎప్పటికప్పుడు కరోనా పాజిటివ్‌ కేసులను గుర్తించడంలో భాగంగా ఏపీ సర్కారు ఏఎన్‌ఎంల ద్వారా వైద్య పరీక్షలు చేసేందుకు 13 జిల్లాలకు 22,060 థర్మామీటర్లు, 21,992 పల్సాక్సీ మీటర్లను సరఫరా చేసింది. వీటి ద్వారా శరీర ఉష్ణోగ్రత, పల్స్‌ రేటును తెలుసుకుంటారు. ఏఎన్‌ఎంలు వార్డులు, గ్రామాలవారీగా ప్రాథమికంగా పరీక్షలు నిర్వహించి జిల్లా వైద్యాధికారులకు ఎప్పటికప్పుడు నివేదికలివ్వాలని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ ఆదేశించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాకు 1,900 థర్మామీటర్లు, తూర్పుగోదావరి జిల్లాకు అత్యధికంగా 2,250 పల్సాక్సీ మీటర్లను సరఫరా చేశారు.