
Vijayawada, July 13: ఏపీలో గుంటూరు జిల్లా రెంటచింతల గ్రామంలో ముఖానికి మాస్క్ ధరించలేదని ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో (Andhra Pradesh Horror) ఓ యువతి ప్రాణం కోల్పోయింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు (Guntur) జిల్లాలోని రెంటచింతల (Rentachintala) గ్రామంలో ఈ నెల 3వ తేదిన కర్నాటి యలమంద అనే రిక్షా కార్మికుడు ముఖానికి మాస్క్ లేకుండా తిరగడాన్ని గమనించిన అక్కడి కుర్రాళ్ళు నలుగురు అతనితో వాగ్వాదానికి దిగారు. జగనన్న తోడు, సున్నా వడ్డీకే రూ. 10 వేల రుణం, దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి, గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం సర్వే
అయితే అదే రోజు సాయంత్రం ఈ నలుగురు సైతం రిక్షా కార్మికుడి ఇల్లు ఉండే బజారులో ముఖానికి మాస్కు లేకుండా కనిపించారు. దాంతో తనను ఉదయం అడిగారని యలమంద కూడా వారితో మీ ముఖానికి మాస్కులు ఎక్కడ అని అడిగాడు.అలా అడగడంతో ఘర్షణ ( Fight Over Wearing Mask) మెదలైందని అంటున్నారు.
ఆ యువకులు బలంగా ఉండడంతో ఆ రిక్షా కార్మికుడి మీద దాడికి దిగారు. దీనితో యలయంద కుమార్తె ఫాతిమా (19) మా నాన్నను కొట్టవద్దంటూ వారిని వారించింది. ఆమె అడ్డు రావడంతో అందులో ఒకరు ఫాతిమా పై కర్రతో దాడి చేయడంతో అమె తలకు బలమైన గాయమయి కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు. వారం రోజుల చికిత్స అనంతరం శుక్రవారం రాత్రి ఫాతిమా మృతి చెందింది. దీంతో ఆమె మీద దాడి చేసిన నలుగురిపై హత్య నేరం క్రింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.