Jagananna Thodu Scheme: జగనన్న తోడు, సున్నా వడ్డీకే రూ. 10 వేల రుణం, దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులకు లబ్ధి, గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం సర్వే
Ap cm ys jagan (Photo-Twitter)

Amaravti, July 13: వ్యాపారులు ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో నాలుగు నెలల నుంచి వారికి సరైన వ్యాపారం లేదు. ఉన్న సరుకు అమ్ముడుపోక నష్టపోయారు. ఈ నేపథ్యంలో వారు తిరిగి వ్యాపారం చేసుకునేందుకు జగనన్న తోడు పథకం (Jagananna Thodu Scheme) ద్వారా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం (YS Jagan Govt) అండగా నిలుస్తోంది. పట్టణ పేదరిక నిర్మూలన, వీఎంసీ పట్టణ సామాజికాభివృద్ధి విభాగం (UCD) సౌజన్యంతో ష్యూరిటీ లేని రుణాల మంజూరుకు చర్యలు తీసుకుంటోంది.  భారీగా కోలుకున్న కరోనా బాధితులు, దేశంలో ఇప్పుడు కోవిడ్-19 యాక్టివ్ కేసులు 3,01,609 మాత్రమే, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసులు 8,78,254

2020 మార్చి నాటికి వీధి వ్యాపారులుగా గుర్తింపు పొందిన వారందరికీ సత్వర రుణాల మంజూరుకు ఇటీవలే బ్యాంకర్లతో కూడా వీఎంసీ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ పథకం (Jagananna Thodu) ద్వారా ఒక్కొక్కరికి రూ.10 వేల రుణాన్ని సత్వరమే ఎలాంటి ష్యూరిటీ లేకుండా అందించాలని బ్యాంకర్లకు సూచించారు.

అర్హత కలిగిన వారు ఎవరు ?

చిరు వ్యాపారి వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామాల్లో రూ.10 వేల లోపు, పట్టణాల్లో రూ.12 వేల లోపు ఉండాలి.

ఆధార్, ఓటరు కార్డు లేదా ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర గుర్తింపు కార్డును తప్పనిసరిగా కలిగి ఉండాలి.

రోడ్డు వెంబడి పండ్లు, కూరగాయలు, పూలు, చిన్నపిల్లల బొమ్మలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల విక్రయదారులు. తలపై గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు అర్హులు.

దుస్తులు, మాస్కులు విక్రయదారులు, హెల్మెట్లు, కొబ్బరిబొండాల వ్యాపారులు

ఆహార పదార్ధాలు అమ్మే వ్యాపారాలు (ఫాస్ట్‌ఫుడ్, పానీపూరి, సమోసా లాంటివి), – ఫ్యాన్సీ వస్తువులు, పాన్, బీడీలు, పాలు, పాల ఉత్పత్తులు, టీ, కాఫీ అమ్మేవారు, కర్రీ పాయింట్స్, చేపలు, కోడిగుడ్లు, చికెన్, మటన్‌ విక్రయదారులు

ఫ్రూట్‌ జ్యూస్, కూల్‌ డ్రింక్స్, స్టేషనరీ, సైకిల్‌ రిపేర్, మెకానిక్, సిలిండర్‌ రిపేరు,

స్నాక్స్, హ్యాండీక్రాఫ్ట్‌ ఉత్పత్తులు, కాస్మోటిక్స్, సీజనల్‌ ఐటమ్స్‌ అమ్మేవారు(గొడుగులు, కళ్లజోళ్లు, స్వెట్టర్లు తదితరాలు)

లెదర్‌ ఉత్పత్తులు (బూట్లు, బెల్టులు, పర్సులు, బ్యాగులు) సింతటిక్‌ బ్యాగ్‌లు, పోస్టర్లు, పొటోఫ్రేమ్‌లు,

డ్రై ఫ్రూట్స్, పచ్చళ్లు, ఆహార ము డి పదార్థాలు, గింజలు, కుండలు

పూజా సామగ్రి, ఇస్త్రీ, రోడ్‌ సైడ్‌ టైలరింగ్, ఓపెన్‌ బా ర్బర్, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, కొవ్వొత్తులు తదితర విక్రయ దారులను వీధి వ్యాపారులుగా ప్రభుత్వం గుర్తించింది.

ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి సైకిల్, మోటార్‌ సైకిళ్లు, ఆటోలపై తిరుగుతూ వ్యాపారం చేసుకునే వారు కూడా అర్హులే.

గ్రామాల్లో, పట్టణాల్లోనైనా సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులను ఏర్పాటు చేసుకున్న వారు ఈ పథకానికి అర్హులు.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులు ఉంటారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వీరందరికీ గుర్తింపు కార్డులు జారీ చేసేందుకు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోంది. ఈ నెల 18వ తేదీ వరకు సర్వే నిర్వహించి 30వ తేదీకల్లా అర్హులను గుర్తించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు .