COVID-19 Cases in AP: ఏపీలో 19కు చేరిన కరోనా కేసులు, ఒక్కరోజే ఆరు పాజిటివ్ కేసులు, ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలి, ఏపీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలు
నిన్న ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా (Coronavirus) తేలింది. వారిద్దరూ కూడా భార్యభర్తలు. వారిని ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చిక్సిత్స అందిస్తున్నారు.కాగా ఇటీవలే వారు ఢిల్లీ వెళ్లివచ్చారు. అంతకుముందు కర్నూలు జిల్లాలో రాజస్థాన్ యువకుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఏపీలో (Andhra Pradesh) నిన్న ఒక్కరోజే మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో (AP) కరోనా బాధితుల సంఖ్య 16కు చేరింది.
Amaravati, Mar 29: ఏపీలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మెల్లిగా (COVID-19 Cases in AP) పెరుగుతున్నాయి. నిన్న ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఇద్దరు వ్యక్తులకు కరోనా పాజిటివ్ గా (Coronavirus) తేలింది. వారిద్దరూ కూడా భార్యభర్తలు. వారిని ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చిక్సిత్స అందిస్తున్నారు.
మాకు కుటుంబం ఉంది, సెలవులు లేకుండా మీకోసం కష్టపడుతున్నాం
కాగా ఇటీవలే వారు ఢిల్లీ వెళ్లివచ్చారు. అంతకుముందు కర్నూలు జిల్లాలో రాజస్థాన్ యువకుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఏపీలో (Andhra Pradesh) నిన్న ఒక్కరోజే ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో (AP) కరోనా బాధితుల సంఖ్య 19కు చేరింది.
చీరాలకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చారు. నవాబ్ పేటకు చెందిన ఆయనతోపాటు, ఆయన భార్యలోనూ కరోనా లక్షణాలు కనిపించడంతో ఇద్దర్నీ ఒంగోలు రిమ్స్‌లో చేర్పించారు. వారి నమూనాలను సేకరించి విజయవాడ పంపగా కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిద్దరూ వృద్ధులు కావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒంగోలులో ఇప్పటికే మరో వ్యక్తికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. కాగా ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది.
కరోనా ఖేల్ ఖతం అంటున్న అమెరికా
ఇక కర్నూలు జిల్లాలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైందని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. సంజమల మండలం నోసంలో రాజస్థాన్ యువకుడికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అతడు నోసం రైల్వేలో కాంట్రాక్టు పనులు చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం అతడు కర్నూలులోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. దీంతో అతడు ఎవర్ని కలిశాడనే దిశగా అధికాులు దర్యాప్తు జరుపుతున్నారు. నోసం గ్రామం పరిసరాల్లోని 7 కి.మీ. ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా పరిగణించారు. అతడు కలిసిన 52 మందిని కడప జిల్లా ప్రొద్దుటూరులో క్వారంటైన్‌లో ఉంచారు.
కరోనావైరస్.. విద్యార్థులందరూ పాస్
ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ రావాలనుకుంటున్న రాష్ట్ర ప్రజలంతా ఎక్కడి వారు అక్కడే ఉండాలని మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. అర్బన్ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని.. పట్టణాలు, నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి 10 మందికి ఒక డాక్టర్‌ను కేటాయించామని, వాలంటీర్లు, ఆశా వర్కర్లు ఏఎన్‌ఎంలకు అవసరమైన సేఫ్టీ మెజర్స్ అందించామని తెలిపారు.
కాగా 428 మంది శాంపిల్స్‌ను కరోనా వైరస్ పరీక్షల నిమిత్తం పంపించగా.. అందులో 378 మందికి కరోనా నెగిటివ్ రాగా 19మందికి పాజిటివ్‌గా వచ్చినట్లు వెల్లడించారు. విదేశాల నుంచి 29, 264 మంది రాష్ట్రానికి వచ్చారని అందులో 29,115 మందిని హో క్వారంటైన్‌లో ఉంచామని చెప్పారు. ఇక మిగిలిన 149 మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు ఆయన తెలిపారు. కాగా నిత్యా వసరాల రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
శనివారం ఒక్కరోజే 74 నమూనాలను పరీక్షించగా 68 మందికి కరోనా వైరస్ లేదని తేలింది. మిగతా ఆరు పాజిటివ్‌గా వచ్చాయి. ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో 29,242 మంది ఉన్నారని, 179 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.రాష్ట్రంలో తొలి పాజటివ్ కేసుగా నమోదైన నెల్లూరు వాసి కోలుకున్నట్లుగానే.. రెండో పాజిటివ్ కేసైన విశాఖ వాసి కూడా కోలుకుంటున్నాడు.