Cyclone Asani Alert: దూసుకొస్తున్న తుఫాన్, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక, ఉత్తర కోస్తాంధ్రవైపు దూసుకొస్తున్న తుపాన్, తెలంగాణలోనూ మూడు రోజుల పాటూ భారీ వర్షాలు పడే ఛాన్స్
అంతకంతకూ టెన్షన్ పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ‘అసని’(Asani) తుఫాను (Cyclone)కొనసాగుతోందని.. రానున్న 6 గంటల్లో అది తీవ్ర తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Vijayawada, May 08: అసని (Asani) తుఫాను దూసుకొస్తోంది. అంతకంతకూ టెన్షన్ పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ‘అసని’(Asani) తుఫాను (Cyclone)కొనసాగుతోందని.. రానున్న 6 గంటల్లో అది తీవ్ర తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈనెల 10వ తేదీ నాటికి తుఫాను క్రమంగా ఉత్తర కోస్తాంధ్ర (Coastal Andhra)- ఒడిశా (Odisha) తీరానికి దగ్గర వస్తుందని తెలిపింది. అనంతరం దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యం వైపు కదులుతూ ఒడిశాలోనే వాయవ్య బంగాళాఖాతంలో తీరం దాటే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్ తెలిపారు. తుఫాను ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు ఉత్తరాంధ్రలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెబుతూ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటన విడుదల చేసింది.
అటు తెలంగాణలో (Telangana) రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD Hyd) తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, విదర్భ నుంచి కర్నాటక వరకు ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడిందని చెప్పింది. రాగల 12 గంటల్లో తూర్పు బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా బలపడే అవకాశం వెల్లడించింది.