Andhra Pradesh: ఏపీలో వైద్య విద్యార్థులకు డ్రస్ కోడ్, ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదు, ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్థులు ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని (DME bans jeans, t-shirts) రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) స్పష్టంచేసింది.అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు కూడా జీన్స్ ధరించకూడదని (medicos, docs in teaching hospitals) ప్రకటనలో తెలిపింది.

Doctor (Photo File Image)

VJY, Dec 2: ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్థులు ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించకూడదని (DME bans jeans, t-shirts) రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) స్పష్టంచేసింది.అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు కూడా జీన్స్ ధరించకూడదని (medicos, docs in teaching hospitals) ప్రకటనలో తెలిపింది. ఇకపై మహిళా విద్యార్థులు చీరలు, లేదంటే చుడీదార్లు మాత్రమే ధరించాలంటూ రాష్ట్ర వైద్య విద్య సంచాలక కార్యాలయం (డీఎంఈ) ఆదేశాలు జారీ చేసింది.

8 నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు.. వరి కోతల వేళ రైతుల ఆందోళన.. ఏపీలో ఫిబ్రవరి వరకు చలి వణికిస్తుందన్న ఐఎండీ

అలాగే, ఎంబీబీఎస్, పీజీ వైద్య విద్యార్థులు నీట్‌గా డ్రెస్ చేసుకోవాలని, క్లీన్ షేవ్‌తో రావాలని, మహిళలైతే జుట్టును వదులుగా వదిలేయవద్దని సూచించింది. అలాగే, తప్పనిసరిగా స్టెతస్కోప్, యాప్రాన్ ధరించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే నిర్దేశించిన డ్రెస్ కోడ్‌కు కొందరు విద్యార్థినులు, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది తిలోదకాలివ్వడంతో గుర్తించిన అధికారులు ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే, బోధనాసుపత్రులకు రోగులు వస్తే కనుక వారికి సహాయకులు లేరన్న కారణంతో వారిని చేర్చుకోవడం మానొద్దని సూచించింది.

వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరో ప్రమాదం.. పశువులు అడ్డురావడంతో దెబ్బతిన్న ముందరి భాగం.. 12 నిముషాలు రైలు నిలిపివేత.. 2 నెలల్లో నాలుగో ప్రమాదమిది..

డీఎంఈ కార్యాలయంలో జరిగిన వారాంతపు సమీక్షలో తీసుకున్న నిర్ణయాలతో బోధనాసుపత్రులకు పంపిన సూచనల్లో ఈ డ్రస్‌ కోడ్‌ను ప్రస్తావించింది. బోధనాసుపత్రులకు వచ్చే రోగులను ఇన్‌పేషంట్లుగా చేర్చుకోవాల్సి వస్తే.. సహాయకులు లేరని తిరస్కరించొద్దని తెలిపింది. ముఖ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయాలని డీఎంఈ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లకు ఆదేశాలిచ్చారు.



సంబంధిత వార్తలు

Telangana: వీడియో ఇదిగో, విద్యార్థినిని పలుమార్లు కరిచిన ఎలుక, రాబిస్ వాక్సిన్ ఇవ్వడంతో చచ్చుబడిన అవయవాలు, కాంగ్రెస్‌ పాలనలో దుస్థితి ఇది అంటూ హరీష్ రావు ట్వీట్

Andhra Pradesh: మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవం, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన రాష్ట్రపతి ముర్ము, ప్రతి డాక్టర్‌ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపు

One Nation, One Election: జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్‌, డుమ్మా కొట్టిన 20 మంది బీజేపీ ఎంపీలు, నోటీసులు జారీ చేసిన అధిష్టానం, సాధారణ మెజారిటీతో జేపీసీకి వన్‌ నేషన్, వన్‌ ఎలక్షన్‌ బిల్లు

Uttar Pradesh Horror: యూపీలో 5 ఏళ్ళ బాలుడిపై దారుణ అత్యాచారం, హత్య, వెను భాగం నుంచి తీవ్ర రక్తస్రావం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు