Drones Flying Near Srisailam Temple: శ్రీశైలం మహాక్షేత్రం దగ్గర డ్రోన్ల కలకలం, రహస్యంగా ఆలయ పరిసర ప్రాంతాల సమాచారం సేకరించిందనే అనుమానాలు, డ్రోన్ల కదలికలను తెలుసుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసులు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం (Drones Flying Near Srisailam Temple) సృష్టిస్తున్నాయి. గుర్తు తెలియని డ్రోన్ నాలుగు రోజులుగా శ్రీశైల మహాక్షేత్రంలో అత్యంత ఎత్తులో చక్కర్లు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీసినట్టు తెలుస్తోంది.
Kurnool, July 5: ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో డ్రోన్లు కలకలం (Drones Flying Near Srisailam Temple) సృష్టిస్తున్నాయి. గుర్తు తెలియని డ్రోన్ నాలుగు రోజులుగా శ్రీశైల మహాక్షేత్రంలో అత్యంత ఎత్తులో చక్కర్లు కొడుతూ ఫొటోలు, వీడియోలు తీసినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి ఆలయ ప్రాంగణం, మల్లమ్మ గుడి వెనుకాల నుంచి తక్కువ ఎత్తులోకి రావడంతో (Drones sighted over Srisailam temple) గమనించిన భద్రతా సిబ్బంది ఆలయాధికారులకు సమాచారం ఇచ్చారు.
వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విషయం తెలియజేశారు. దీంతో దేవస్థాన అధికారులతో పాటు పోలీసులు, అటవీశాఖ సిబ్బంది డ్రోన్‌ను గుర్తించారు. దానిని వెంబడించేందుకు దేవస్థానం డ్రోన్‌ను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని గమనించి డ్రోన్‌ను నియంత్రిస్తున్న అపరిచిత వ్యక్తి సిగ్నల్స్‌ను ఆపివేశారు. అనంతరం అది కనిపించకుండాపోయింది. శ్రీశైల మహాక్షేత్రానికి ఉగ్రవాదుల ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు గతంలోనే హెచ్చరించాయి.
అలాగే నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ పరిధిలోని రెండో పవర్‌హౌస్‌లో విద్యుదుత్పాదనను నిరంతరం కొనసాగిస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం భారీగా సెకండ్ పవర్‌హౌస్ వద్ద పోలీస్ బలగాలను మోహరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన టెక్నికల్ సిబ్బంది డ్రోన్‌ను వినియోగించి ఫొటోలు, వీడియోల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
ఈ ఘటనపై శ్రీశైలం సీఐ వెంకటరమణ (Srisailam police circle inspector P.V. Ramana) మాట్లాడుతూ.. తమకు ఆలయ అధికారుల నుండి ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రోన్ ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. శ్రీశైలంలోని సత్రాలు, అతిథి గృహాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. డ్యామ్ వద్ద 40 మందితో బందోబస్తును ఏర్పాటు చేసినట్టు వివరించారు.
ఆలయం సమీపంలో ఆకాశంలో సంచరిస్తున్న ఈ డ్రోన్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్వార్టర్స్, ఔటర్ రింగ్ రోడ్, మల్లమ్మ కన్నీరు, ఉత్తరా పార్క్, విశ్వామిత్ర మఠం, రిజర్వాయర్ మరియు కొన్ని ఇతర సైట్లను చిత్రీకరించినట్లు అనుమానిస్తున్నారు. ఆలయం ,ఇతర ప్రదేశాల చిత్రాలను తీయడానికి దాదాపు మూడు డ్రోన్లు అనేకసార్లు తిరుగుతున్నాయని చెబుతున్నారు. ఏదేమైనా, ప్రసిద్ధ ఆలయం మీదుగా అనుమానాస్పద వస్తువు కదులుతున్నట్లు మరియు డ్రోన్ల కదలికలను తెలుసుకోవడానికి రంగంలోకి దిగిన పోలీసులు అలర్ట్ అయ్యారు.
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ కార్యనిర్వాహక అధికారి కె. ఎస్. రామారావు ఈ విషయంపై మాట్లాడుతూ... ఆలయ ప్రాంతం నుండి అడవిలోకి కదులుతున్న డ్రోన్లు చూశామని, వెంటనే పోలీసులు మరియు అటవీ అధికారుల దృష్టికి తీసుకువచ్చామని ఆయన వెల్లడించారు. అయితే, ఆలయం మరియు దాని పరిసరాలపై డ్రోన్‌లను ఉపయోగించి చిత్రాలను తీయడానికి తాము ఇప్పటివరకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని వారు చెప్పారు. టైగర్ రిజర్వ్ జోన్లో జంతువుల కదలికలను కనుగొనడానికి ఈ డ్రోన్‌ను ఎవరైనా ఉపయోగించారా అన్నది తెలియాల్సి ఉందని ఆయన అంటున్నారు.
ఈ క్రమంలో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రమాదం పొంచి ఉందని శ్రీశైలాంను 'నో ఫ్లై' జోన్‌గా (BJP demanded Srisailam be declared a ‘no fly’ zone) ప్రకటించాలని బిజెపి డిమాండ్ చేస్తుంది. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ టి ప్రతాప్ రెడ్డి ఇలాంటి చర్యల ద్వారా హిందూ ఆలయాలపై దాడులకు తెగబడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ను ప్రభుత్వం ‘నో ఫ్లై జోన్'గా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)