One Rupee Biryani: ప్రకాశం జిల్లాలో రూపాయికే బిర్యానీ ఆఫర్.. ఇక ఏమవుతుంది?? అదే జరిగింది.. దాంతో రెస్టారెంట్ నిర్వాహకులు ఏం చేశారంటే??
కట్ చేస్తే, తోపులాటలు, ట్రాఫిక్ జామ్. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జరిగిందీ ఘటన.
Markapuram, April 7: రూపాయికే దమ్ బిర్యానీ అంటే ఎవరైనా ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు కూడా అదే చేశారు. కట్ చేస్తే, తోపులాటలు, ట్రాఫిక్ జామ్. ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జరిగిందీ ఘటన. పట్టణంలో నిన్న ఓ రెస్టారెంటును ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్ యాజమాన్యం ఓ ఆఫర్‌ను ప్రకటించింది. పాత రూపాయి నోటుకు దమ్ బిర్యానీ అంటూ ప్రచారం చేసింది. అంతే.. బిర్యానీ ప్రియులు ఆగమేఘాల మీద రెస్టారెంట్ ముందు వాలిపోయారు. పిల్లల నుంచి పెద్దల వరకు బిర్యానీ కోసం పోటీలు పడ్డారు. దీంతో తోపులాట జరిగింది.
మార్కాపురం-కంభం రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. జనం తాకిడికి తట్టుకోలేకపోయిన రెస్టారెంట్ యాజమాన్యం మధ్యాహ్నం వరకు బిర్యానీ పంపిణీ చేసి ఆ తర్వాత నిలిపివేసింది. .