Egg Prices Spike: ఏపీలో చుక్కలనంటిన కోడిగుడ్డు ధర, ఏడు రూపాయలకు పైసా తగ్గేది లేదంటున్న వ్యాపారులు, నోరెళ్లబెడుతున్న సామాన్యుడు

రైతు ధర రూ.5.44 ఉండగా రిటైల్‌ మార్కెట్‌లో రూ.ఏడుకు చేరింది.కార్తిక మాసం ముగియడంతో స్థానికంగా వినియోగం పెరగడంతో గుడ్డు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Representational Image (Photo Credits: Unsplash.com)

VJY, Dec 7: చాలామంది అమితంగా ఇష్టపడే కోడి గుడ్డు ధర ఏపీలో చుక్కలనంటుతోంది. రైతు ధర రూ.5.44 ఉండగా రిటైల్‌ మార్కెట్‌లో రూ.ఏడుకు చేరింది.కార్తిక మాసం ముగియడంతో స్థానికంగా వినియోగం పెరగడంతో గుడ్డు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీనికి తోడు ఏపీ నుంచి గుడ్లు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు అవ్వడం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పౌల్ట్రీలు అధికంగా ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి దాదాపు 60 శాతం గుడ్లు పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.దీని కారణంగా స్థానికంగా కొరత ఏర్పడుతోంది.

ఒక్కసారి శృంగారం చేస్తే 200 కేలరీలు ఖర్చు, గుండె జబ్బులున్నవారు సెక్స్ చేస్తే ఏమవుతుంది, వైద్యులు ఏమంటున్నారో ఓ సారి చూద్దాం..

మంగళవారం నాటికి రైతు ధర రూ. 5.44కు చేరింది. కాగా రిటైల్‌ మార్కెట్‌లో రూ.6.50 నుంచి రూ.7 పలుకుతుండటంతో సామాన్య వర్గాల వారు వాటిని కొనుగోలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఇంకొన్ని చోట్ల ఏకంగా ఏడు రూపాయలకు పైగానే విక్రయిస్తున్నారు. రెండు వారాల క్రితం రూ.5 ఉన్న గుడ్డు ధరను ఏడు రూపాయలు వరకు పెంచేశారని వినియోగదారులు అంటున్నారు.