Sex (Photo Credits: The Noun Project and File)

ఎవరికైనా శృంగారం అనేది మంచి వ్యాయామాల్లో ఒకటని వైద్యులు చెబుతుంటారు. ఒక్కసారి శృంగారం (Sex) చేస్తే సుమారు 200 కేలరీలు ఖర్చవుతాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే మానసిక, శారీరక ఆరోగ్యం బలపడుతుంది. అయితే ఇదంతా ఆరోగ్యవంతులకేనని గుర్తు పెట్టుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న పురుషులు, మరీ ముఖ్యంగా గుండె జబ్బులున్న వారు (Heart Disease ) వైద్యుల సూచన మేరకే శృంగారం విషయంలో నడుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే శృంగారం సమయంలో గుండెపై (Sex and Heart Health) అధిక పని భారం పడుతుంది. దీంతో గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ముఖ్యంగా పురుషుల పురుషాంగం వద్దకు అధిక రక్త ప్రసరణ అవసరమవుతుంది. ఈ మార్పులను తట్టుకోగల సామర్థ్యంతో మీ గుండె ఉన్నప్పుడు నిస్సంకోచంగా శృంగారంలో పాల్గొనవచ్చు.

భార్యభర్తలు కలిసి పోర్న్ సినిమాలు చూడటం వల్ల కలిగే లాభాలు వింటే ఆశ్చర్యపోతారు, మీ సెక్స్ లైఫ్ మరింతగా ఆస్వాదించడానికి పోర్న్ సహాయపడుతుందట, అదెలాగో చూద్దామా..

మయోక్లినిక్ చెబుతున్న దాని ప్రకారం.. గుండె జబ్బులున్నవారు, హార్ట్ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న వారు (Sex and Heart Disease) సెక్స్ లో పాల్గొనడం రిస్క్ అని భావించడం అసాధారణమేమీ కాదు. హార్ట్ ఫెయిల్యూర్ కోసం వాడే మందులతో శృంగార సామర్థ్యం కూడా తగ్గుతుంది. అంతేకాదు, శృంగారం సమస్యలో దుష్ప్రభావాలు కూడా కనిపిస్తుంటాయి.

శృంగారం హార్ట్ ఎటాక్ కు దారితీయడం అరుదుగానే జరుగుతుందని, హార్ట్ కండిషన్ నిలకడగా ఉందని వైద్యులు చెప్పే వరకు శృంగారానికి దూరంగా ఉండాలని

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సూచిస్తోంది. గుండెకు సంబంధించి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు సైతం శృంగారంలో పాల్గొనకుండా ఉండడం మంచిదని చెబుతోంది.

ఆన్‌లైన్‌లో పోర్న్ వీడియోలు చూస్తున్నారా..అయితే రూ. 3 వేలు కట్టండి, ఇటువంటి బోగస్‌ పాప్‌ అప్‌ నోటీసులు వస్తే స్పందించకండి, తాజాగా ముగ్గురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు

ఇక శృంగారం గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వారంలో కనీసం రెండు సార్లు శృంగారం చేసే పురుషులు, శృంగారం విషయంలో సంతృప్తిగా ఉండే మహిళలకు హార్ట్ ఎటాక్ రిస్క్ తక్కువగా ఉంటున్నట్టు గుర్తించారు. ఇదంతా ఆరోగ్యంగా ఉన్న వారి విషయంలో మాత్రమే.