Amma Vodi: జనవరి 9 నుంచి అమ్మఒడి, లబ్ధిదారుల ఖాతాల్లోకి ఒకేసారి రూ.15 వేలు, 43 లక్షల మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించిన ప్రభుత్వం, అమ్మఒడికి మొత్తం రూ.6400 కోట్లు కేటాయింపు, వెల్లడించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
అన్ని గ్రామాలు,పాఠశాలల్లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలు పెట్టామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 43 లక్షల మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించామని పేర్కొన్నారు.
Amaravati, January 04: అమ్మఒడి పథకం (Amma Vodi Scheme)లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్(AP Education Minister Suresh) తెలిపారు. అన్ని గ్రామాలు,పాఠశాలల్లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలు పెట్టామని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు దాదాపు 43 లక్షల మంది తల్లులను లబ్ధిదారులుగా గుర్తించామని పేర్కొన్నారు.
తెల్ల రేషన్‌కార్డు, ఆధార్, బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేసి లబ్ధిదారులను గుర్తించామన్నారు. అమ్మ ఒడి పథకం కోసం ప్రభుత్వం రూ.6,400 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు.
ఏపీ రాజధానిగా తిరుపతిని చేయండి
ఈ నెల 9న చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. 5వ తేదీ వరకు ఎంతమంది లబ్ధిదారులను గుర్తిస్తే అంత మందికి ఈ పథకం (AP Amma Vodi Scheme 2020) వర్తిస్తుందన్నారు. ముందుగా ఒక్క రూపాయి ఖాతాల్లో వేసి లబ్ధిదారుల ఖాతాలను తనిఖీ చేస్తామని తెలిపారు.
నాడు వైఎస్సార్..నేడు వైఎస్ జగన్
ఈ నెల 9న ఒకేసారి రూ.15వేలు జమ చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. ఈ స్కీమ్ ద్వారా 1 వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే స్టూడెంట్స్ తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం ఏటా రూ. 15 వేలు జమ చేయనుంది.