IPL Auction 2025 Live

Vijayawada Gang War: విజయవాడ గ్యాంగ్ వార్ కేసులో ఊహించని ట్విస్టు, ప్రతి ఒక్కరిపైనా రౌడీషీట్‌ తెరుస్తామని తెలిపిన డీసీపీ హర్షవర్థన్‌, దాడి ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. పటమట సెంటర్ లోని శ్రీనివాస్ నగర్ లో రెండు గ్రూపుల మధ్య వివాదం (Vijayawada Gang War) తలెత్తగా.. కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. ఈ దాడిలో ఓ వర్గానికి నాయకత్వం వహిస్తున్న తోట సందీప్ (young man lost his life in the fight) మరణించారు. విజయవాడలోని (Vijayawada) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతూ మరణించాడు. మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్న పండు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Vijayawada Gang War (photo-Twitter Video Grab)

Amaravati, June 1: ప్రశాంతంగా ఉన్న ఏపీలోని విజయవాడలో కొందరు రౌడీ మూకల్లా రెచ్చిపోయారు. నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. పటమట సెంటర్ లోని శ్రీనివాస్ నగర్ లో రెండు గ్రూపుల మధ్య వివాదం (Vijayawada Gang War) తలెత్తగా.. కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. కిటకిటలాడుతున్న రైల్వే స్టేషన్లు, దేశ వ్యాప్తంగా పట్టాలెక్కిన 200 రైళ్లు, తెలుగు రాష్ట్రాల నుంచి 9 రైళ్లు, విజయవాడ మీదుగా 14 రైళ్లు, పలు మార్గదర్శకాలను విడుదల చేసిన రైల్వే శాఖ

ఈ దాడిలో ఓ వర్గానికి నాయకత్వం వహిస్తున్న తోట సందీప్ (young man lost his life in the fight) మరణించారు. విజయవాడలోని (Vijayawada) ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతూ మరణించాడు. మరో వర్గానికి నాయకత్వం వహిస్తున్న పండు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పటమటలో రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణపై డీసీపీ హర్షవర్దన్ స్పందించారు. పెనమలూరులోని ఓ అపార్టుమెంట్ విషయంలో సందీప్, మణికంఠ మధ్య తలెత్తిన విబేధాలే ఘర్షణకు (Bejawada Gang War) కారణమని తెలిపారు. దీనిలో ఎవరెవరి ప్రమేయం ఉందో వాళ్లపై గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఘర్షణకు కారణమైనవారిని పట్టుకునేందుకు ఆరు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు పరుగులు పెట్టనున్న బస్సులు, అంతరాష్ట్ర రాకపోకలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోని ఏపీ ప్రభుత్వం

వీలైనంత త్వరగా పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘర్షణలో విద్యార్థులు ఉంటే వారిపై కేసులు, రౌడీ షీట్ పెడతామన్నారు. ఇలాంటి దాడుల్లో విద్యార్థులు పాల్గొని జీవితాలను నాశనం చేసుకోవద్దని డీసీపీ హర్షవర్ధన్ సూచించారు. ఈ గ్యాంగ్‌వార్‌లో ఉన్న ప్రతి ఒక్కరిపైనా రౌడీషీట్‌ తెరుస్తామని డీసీపీ హర్షవర్థన్‌ తెలిపారు.

Here's Gang war in vijayawada Video

పటమటలో జరిగిన గ్యాంగ్‌ వార్‌లో మృతిచెందిన రౌడీషీటర్‌ సందీప్ మృతదేహానికి వైద్యులు సోమవారం పోస్టుమార్టం నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రి వద్ద పోలీసులు అలర్ట్‌ ప్రకటించారు. అలర్లు జరగకుండా ముందుస్తుగా ఆసుపత్రి ఆవరణలో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. మార్చురీ వద్దకు ఎవరిని కూడా పోలీసులు అనుమతించడం లేదు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. చంద్రబాబు,నారా లోకేశ్‌లపై కేసు నమోదు, లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించారంటూ నందిగామ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఇచ్చిన ఓ న్యాయవాది, వారిద్దరితో పాటు మరికొందరిపై కేసులు

ఇదిలా ఉంటే గ్యాంగ్‌‌వార్‌‌లో ప్రాణాలు కోల్పోయిన తోటా సందీప్ మృతదేహం తరలింపులో తర్జనభర్జనలు నెలకొన్నాయి. మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్తామని పోలీసులను కుటుంబ సభ్యులు కోరారు. తల్లి ఇంటి వద్ద నుంచి కదలలేని పరిస్థితిలో ఉండటంతో కడసారిచూపు కోసం ఇంటికి అనుమతించాల్సిందిగా పోలీసులను కుటుంబసభ్యులు కోరారు. అయితే పోలీసులు మాత్రం మృతదేహాన్ని నేరుగా స్వర్గపురికే తీసుకెళ్లాలని ఆదేశించారు.

యనమలకుదురులో ఓ ల్యాండ్ సెటిల్‌మెంట్‌లో భాగంగా గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు.రూ.2 కోట్ల విలువైన స్థలం విషయంలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఘర్షణకు పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆరు ప్రత్యేక బృందాలను విజయవాడ సీపీ ఏర్పాటు చేశారు. పండు గ్యాంగ్‌లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నగరంలో రెండు గ్రూపుల మధ్య తలెత్తిన వివాదంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఉద్రిక్తతలు చోటుచేసుకున్న శ్రీనివాస్ నగర్‌లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ వివాదంలో ఎంతటి వారున్నా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వైఎస్సార్ పెన్షన్‌ కానుక, జూన్ నెల పెన్సన్లను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్న వాలంటీర్లు, రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ

గత టీడీపీ పాలనలో విజయవాడలో రౌడీ పాలన సాగిందని మంత్రి మండిపడ్డారు. ఇకపై నగరంలో వారి ఆటలు సాగవన్నారు. పటమటలో ఆదివారం ఇరువర్గాల మధ్య జరిగిన దాడుల్లో ఒకరు మృతి చెందిన విషయం తెలిసిందే. టీడీపీకి చెందిన తోట సందీప్‌, జనసేనకు చెందిన పండు గ్యాంగ్‌ల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సందీప్పై పటమట స్టేషన్‌లో 13 కేసులున్నాయని సమాచారం. ఇక మరో వర్గం నాయకుడు పండుపై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో సుమారుగా 13 కేసులు ఉన్నట్టు సమాచారం. ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటి వరకు 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.



సంబంధిత వార్తలు