Case filed against Chandrababu and Nara Lokesh for violating lockdown rules (Photo-PTI)

Amaravati, June 1: కోవిడ్-19 వ్యాప్తి నియంత్రణకు(COIVD-19) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను (Lockdown) విధించిన సంగతి తెలిసిందే. ఆ లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా ప్రధానంగా భౌతికదూరం, మాస్కుల వినియోగం తప్పనిసరిగా పాటించాల్సిందే. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలను చంద్రబాబు, లోకేశ్‌లు ఉల్లంఘించారంటూ (violating lockdown rules) ఓ న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందిగామ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వైఎస్సార్ పెన్షన్‌ కానుక, జూన్ నెల పెన్సన్లను ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందిస్తున్న వాలంటీర్లు, రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ

ఎస్‌హెచ్‌వో కనకారావు తెలిపిన వివరాల మేరకు.. చంద్రబాబు, లోకేశ్‌లు మే 25న హైదరాబాద్‌ నుంచి రహదారి మార్గాన విజయవాడ వైపు వెళ్లారు. ఆ సమయంలో వారు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారని న్యాయవాది, వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి బర్రె శ్రీనివాసరావు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిద్దరితో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. ప్రజలకు తీపి కబురు, జూన్ 10న తెలుగు రాష్ట్రాలను తాకనున్న నైరుతి రుతుపవనాలు, రెండు రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం

చంద్రబాబుపై ఐపీసీ సెక్షన్‌ 188 కింద కేసుల నమోదు చేశారు. మే 25న హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గంలో వెళ్లారు. భారీ కాన్వాయ్‌తో ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట, కంచికర్లలో జనసమీకరణకు కారణం అయ్యారంటూ లాయర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక అనుమతితో మే 25న ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు మార్గమధ్యంలో పలుచోట్ల జనసమీకరణ, బైక్‌ ర్యాలీలకు కారణం అయ్యారంటూ ఆయన ఫిర్యాదు చేశారు.