Nimmagadda Ramesh Kumar: వివాదాల నడుమ ఏపీ ఎస్ఈసీగా మళ్లీ నిమ్మగడ్డ నియామకం, అర్థరాత్రి ఉత్తర్వులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి నియామకం

హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ (Governor Biswabhushan Harichandan) పేరుతో ఈ ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్‌) విడుదల చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు.

AP Election Commissioner Nimmagadda Ramesh Kumar | File Photo

Amaravati, July 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను (Nimmagadda Ramesh Kumar) పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం (AP Govt) గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయనను తిరిగి నియమిస్తున్నట్లు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ (Governor Biswabhushan Harichandan) పేరుతో ఈ ప్రకటన జారీ చేశారు. ఈ మేరకు రాజపత్రం (గెజిట్‌) విడుదల చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు ఇచ్చారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున నిర్ణయం తీసుకోలేమంటున్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

అయితే సుప్రీంకోర్టులో (Supreme Court) రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడి ఈ పదవీ పునరుద్ధరణ నోటిఫికేషన్‌ ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ హైకోర్టు, గవర్నర్ ఆదేశాల మేరకు తిరిగి ఎన్నికల కమిషనర్ గా (State Election Commissioner) నియామకమైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. విజయవాడలో బందరు రోడ్డులోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో నిమ్మగడ్డ బాధ్యతలు చేపట్టేందుకు వీలుగా ఆధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే గతంలో స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా వేసిన తర్వాత నిమ్మగడ్డ రాష్ట్రంలో పలువురు ఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. స్ధానిక ఎన్నికల వాయిదాకూ, ఈ బదిలీలకు సంబంధం లేదని వాదించిన జగన్ సర్కార్ వాటిని పక్కనబెట్టింది. ఆ తర్వాత నిమ్మగడ్డ స్వయంగా సీఎస్ నీలం సాహ్నీకి లేఖ రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు బాధ్యతలు తీసుకోగానే తాను గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని ప్రభుత్వానికి లేఖ రాస్తారా లేక మరో ఆదేశం ఇస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు

ప్రస్తుతానికి ఎలాగో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించే పరిస్ధితి లేకపోవడంతో అప్పటి వరకూ చేపట్టాల్సిన చర్యలపై మాత్రం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో నిమ్మగడ్డ స్ధానంలో బాధ్యతలు చేపట్టిన జస్టిస్ కనగరాజ్ ఓసారి అధికారులతో ఇదే విషయంపై సమీక్ష నిర్వహించారు.

నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎస్ఈసీగా ఉన్న సమయంలో కోవిడ్ 19 వ్యాప్తి చెందుతున్న తరుణంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జగన్ సర్కార్.. ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకొచ్చి ఆయన్ను పదవి నుంచి తొలగించింది. దీనిపై నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. కానీ స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. తాజాగా, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

తర్వాత నిమ్మగడ్డ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయగా.. కోర్టు గవర్నర్‌ను కలిసి చర్చించాలని సూచించింది. దీంతో బిశ్వభూషణ్ హరిచందన్‌ను నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సమావేశమయ్యారు. తనను ఎస్‌ఈసీగా పునర్నియామకం చేయాలంటూ గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. హైకోర్టు తీర్పుతో పాటూ మిగిలిన అంశాలపై గవర్నర్‌తో చర్చించారు. తిరిగి తనను ఎస్‌ఈసీగా నియమించాలని కోరారు.. హైకోర్టు తీర్పును అమలు పరచాలని.. తిరిగి తనను ఎస్‌ఈసీగా నియమించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అడిగారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎస్‌ఈసీగా కొనసాగించాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించారు. హైకోర్టు తీర్పు ప్రకారం ఎస్‌ఈసీగా నిమ్మగడ్డను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈమేరకు లేఖ రాశారు.