Fire Accident in Guntur: అగ్ని కీలల్లో 6 గురు ఒడిశా కూలీలు సజీవ దహనం, మావనతా దృక్పథంతో స్పందించిన ఏపీ సీఎం వైయస్ జగన్, మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులకు ఆదేశాలు

మృతుల కుటుంబాలకు (Financial Assistance family odisha labourers) రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

AP Chief Minister YS Jagan | File Photo

Amaravati, July 31: ఏపీలో రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో జరిగిన అగ్నిప్రమాదంలో (Fire Accident) ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆరుగురు కూలీల మృతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) మావనతా దృక్పథంతో స్పందించారు. మృతుల కుటుంబాలకు (Financial Assistance family odisha labourers) రూ.3 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

బతుకుదెరువు కోసం ఒడిషా నుంచి రాష్ట్రానికి వచ్చి అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కూలీలకు మానవతాదృక్పథంతో సాయం అందించాలని సీఎం అన్నారు. రొయ్యల చెరువుల యాజమాన్యం నుంచి కూడా మృతుల కుటుంబాలకు తగిన పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఒడిశాలోని రాయగఢ్‌ జిల్లా గునుపూర్‌ మండలానికి చెందిన 25 మంది యువకులు లంకెవానిదిబ్బలోని మండలి బెయిలీ అనే వ్యక్తికి చెందిన రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు 15 రోజుల క్రితం వచ్చారు. చెరువుల వద్ద ఉన్న షెడ్లలోనే వారంతా మకాం ఉంటున్నారు. ఎప్పటిమాదిరిగానే గురువారం చెరువుల్లోని రొయ్యలకు మేత వేశారు.రాత్రి వారంతా భోజనాలు చేసి షెడ్లలోని రెండు గదుల్లో నిద్రకు ఉపక్రమించారు.

తూర్పు గోదావరి జిల్లాలో 300 కుక్కలకు విషం ఇచ్చిన చంపిన అధికారులు, అమానుష ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫైట్‌ ఫర్‌ యానిమల్ ఆర్గనైజేషన్, బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

అర్ధరాత్రి వేళ షెడ్‌లోని ఒక గదిలో అకస్మాత్తుగా పొగలు కమ్ముకుని పేలుడు సంభవించగా, అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఆ గదిలో 10 మంది నిద్రిస్తుండగా.. మంటల్లో చిక్కుకుపోయిన నబీన్‌ సబార్‌ (23), పండబూ సబార్‌ (18), మనోజ్‌ సబార్‌ (18), కరుణకార్‌ సబార్‌ (18), రామ్మూర్తి సబార్‌ (19), మహేంద్ర సబార్‌ (20) అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.