Representational Image (Photo Credits: Pixabay)

Vijayawada, July 31: ఏపీలొ పశ్చిమ గోదావరి జిల్లాలో కుక్కలపై అధికారులు ప్రదర్శించిన తీరు వివాదాస్పదమవుతోంది. ఆ జిల్లాలోని లింగపాలెం పంచాయతీ అధికారులు 300 మూగజీవాలను విషపు ఇంజక్షన్లతో (Over 300 Stray Dogs Poisoned by Panchayat Officials)చంపేశారు. వాటిని చంపేసి . గుంతలో అలా పడేశారు. కనీసం మట్టి కూడా పూడ్చకుండా వదిలేశారు. ఈ దారుణ ఘటనపై ఫైట్‌ ఫర్‌ యానిమల్ ఆర్గనైజేషన్ సీరియస్ అయింది. ఈ చర్యలకు పాల్పడ్డ పంచాయతీ అధికారులపై ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్‌లో (Dharmajigudem Police Station‌) ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అయితే ఈ ఘటనపై పంచాయతీ అధికారుల మరోలా చెబుతున్నారు. కుక్కలు తరచూ దాడులకు తెగపడుతున్నాయి, ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా పోగై రాకపోకలకు అంతరాయం కల్గిస్తున్నాయని చెప్తున్నారు. ఈ కారణంగా విషం పెట్టి చంపినట్లు చెప్తున్నారు. ప్రజారోగ్యం రీత్యానే ఇలాంటి చర్యలు తీసుకున్నట్లు వివరిస్తున్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫైట్‌ ఫర్‌ యానిమల్ ఆర్గనైజేషన్. డిమాండ్ చేస్తోంది.

అక్రమ సంబంధం వద్దన్న మామ, కావాలన్న కోడలు, ఆగ్రహంతో కోడలిని కత్తితో దారుణంగా పొడిచి చంపిన మామ, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు, తూర్పుగోదావరిజిల్లా మకిలిపురం మండలంలో ఘటన

వాస్తవానికి జంతుహింస నేరం, సృష్టిలో ప్రతి జీవికి జీవించే హక్కు ఉంది. ఆ హక్కులను కాలరాసే అధికారం ఎవరికి లేదు. మరి దీనిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.